కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

హైదరాబాద్, రోమింగ్ న్యూస్:
ట్రిలియన్ ట్రీ ఉద్యమం లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిజ్ఞ తెలంగాణకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యతను కలిగిస్తోంది. ఈ ఉద్యమం ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవవాతావరణాన్ని అందించేందుకు రాష్ట్రం నిశ్చయబద్ధంగా ముందడుగు వేస్తోంది.దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ (1t.org) నిర్వాహకులతో ముఖ్యమంత్రి గారు జరిపిన చర్చల్లో, తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో చేస్తున్న కృషి మరియు నెట్ జీరో విధానాల అమలు గురించి వివరించడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్ కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి తెలంగాణ రైజింగ్ మిషన్ పర్యావరణ ప్రమాణాలను ప్రపంచానికి తెలియజేయడం గమనార్హం.ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెడతాయనీ, భవిష్యత్తులో మరిన్ని హరిత కార్యక్రమాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందనీ ఆశిద్దాం.
