
యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహా పూర్ణహుతిలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట ఆలయ ఏపూరి భాస్కరరావు ఆధ్వర్యంలోని అర్చక బృందం గవర్నర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ప్రధానార్చకులు నల్లం దీగల్ లక్ష్మీనరసింహ చార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం రాష్ట్ర గవర్నర్ కు ఆశీర్వచనం జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు.

