RN DAILY     G9 TELUGU TV    ePaper

మంత్రి పొన్నం ఆదేశాలను లెక్కచేయని టూరిజం ఎం.డీ ని సస్పెండ్ చేయాలి

గౌడ సంఘాల డిమాండ్

హైదరాబాదు, రోమింగ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తన బినామీ శంకర్ రెడ్డి కి లోపాయిాకారి తో ఒప్పందం కుదుర్చుకున్నారని నీరా కేఫ్ భవనం నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన గౌడ సంఘాల నాయకుల పాత్రికేయ సమావేశంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, గోపా రాష్ట్ర అధ్యక్షులు.డాక్టర్ బండి సాయన్న గౌడ్ గౌడ్ లు మాట్లాడుతూ ఆరోపించారు. గౌడకులస్తులకు ఆత్మగౌరవ ప్రతీక అయిన నీరా కేఫ్ భవనం ను గీత కార్పొరేషన్ సంస్థ కు దక్కకుండా కుట్ర చేస్తూ శంకర్ రెడ్డి నీ ప్రోత్సహిస్తూ కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకో అని అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నడన్నారు.అసలు బహిరంగ టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో చేయకుండా అంతర్గతంగా రహస్య ఒప్పందాలు, లావాదేవీలు, అక్రమార్గాలలో డబ్బులు దండుకోవడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.గౌడ సంఘాల ఉద్యమాలతో దిగివచ్చి గీత కార్పొరేషన్ సంస్థ కు బదలాయిస్తామని షరతులతో కూడిన సర్క్యులర్ విడుదల చేశారన్నారు.నీరా కేఫ్ భవనం లో గౌడ ప్రతిమలు తీసివేశాడని , చెట్లు నరికేశాడని , లెక్ వ్యూ పుడ్ కోర్టు అని బోర్డులు పెట్టీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవరించినాడని చెప్పారు. శంకర్ రెడ్డి టెండర్ రద్దు చేస్తున్నాం అని చెప్పుతూనే శంకర్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపొవడం అతనికి అనుకూలంగా కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకో అని ప్రోత్సహిస్తున్నది ప్రకాశ్ రెడ్డి అని స్పష్టంగా తెలుస్తుందన్నారు.తక్షణమే టూరిజం ఎం.డీ ప్రకాశ్ రెడ్డిని , సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.నీరా కేఫ్ ఆస్తులు ధ్వంసం చేసిన శంకర్ రెడ్డి మీద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు.నీరా కేఫ్ భవనం లో ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు వివరాలు బయట పెట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు.నీరా కేఫ్ భవనం లాగానే మిగతా టూరిజం శాఖ పరిధిలో ఉన్న అన్ని విభాగాల మధ్య జరిగిన ఒప్పందాలు లావాదేవీలు ప్రభుత్వం బహిరంగ పరచాలబి కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియరీ కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. బేషరతుగా గీత కార్పొరేషన్ సంస్థ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్నారు. లేని పక్షంలో లక్షలాది గౌడులు ఉద్యమాలకు సిద్దమవుతారని గుర్తు చేస్తున్నామన్నారు.గౌడకుల ఆత్మగౌరవాన్ని చులకన చేస్తున్న వారికి తగిన గుణ పాఠం చెప్పటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ నెట్వర్క్ చీకటి ప్రభాకర్ గౌడ్, గౌడ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులు చెక్కిళ్ళ మధు సుధాన్ గౌడ్గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు వంగా సదానందం గౌడ్, గౌడ సంఘం మల్లేశం గౌడ్,గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ,దేశం మహేష్ గౌడ్, భవాని గౌడ్, అమర్నాథ్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!