కొత్త రాజ్యాంగం కావాలంటున్నట్లు మరోసారి సీఎం స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):
దేశ ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుకు తాను సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్లవ్ చంద్రశేఖర రావు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తనతో అవుతుందనే నమ్మకముందని చెప్పారు. దేశానికి సేవ చేసే అవసరం ఏర్పడితే ఖచ్చితంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది అవహేళన చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశానికి సేవ చేసే విషయంలో కేసీఆర్ కొత్త పార్టీ పెడతారా అని ఒక విలేకరి ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. వై నాట్…ఎస్…దేశ రాజకీయాల్లో మార్పు కోసం తాను జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతానని సంచలనం కలిగించారు.
కొత్త రాజ్యాంగం కోరుకుంటున్న
భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నాను… అవును.. దళితులకు మరింత న్యాయం జరగడం కోసం కొత్త రాజ్యాంగము కోరుతున్నా నన్నారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం… మహిళలకు సాధికారత కోసం, రాజ్యాంగం మారాలి అంటున్నా కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నా నేను కోరుకున్నది దళితులు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే కేసీఆర్ కోసం కాదని స్పష్టం చేశారు. కొత్త రాజ్యాంగం కావాలనడములో తప్పు లేదని ఆయన తనకు తాను సమర్థించుకున్నారు. బీసీలకు కుల గణన అంటున్నా తప్పేముందని ప్రశ్నించారు. రాజ్యాంగము ప్రగతిశీలంగా ఉండాలని అంబేద్కర్ చెప్పారు… అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ధర్మం పేరిట రాజకీయాలను కలుషితం చేస్తున్నారు… దేశం కోసం ముందుకు వెళ్లాల్సింది దేశ ప్రజలేఅన్నారు. సమైక్యవాది అయిన చంద్రబాబు జై తెలంగాణ అనలేదా అంటూ ప్రతీదీ సాధ్యమేనని తెలిపారు. ప్రజలు కలిసి వస్తే పరిస్థితి మారుతుందని వివరించారు.