ఒక జాతికి, దాని భాషా సంస్కృతులకు విడదీయరాని సంబంధం కనిపిస్తుంది. మనిషి అన్ని సాధనాలకూ తొలి ఆధారం సాంస్కృతిక వ్యక్తిత్వం. ఆ తరహా స్పృహ పెంచడానికి మాతృభాష దోహదం చేస్తుంది. మన మాతృభాషా స్థాయిని ఎంత పెంచుకుంటే, మన సంస్కృతి అంత సమున్నత స్థితిలో ఉంటుంది. ఈ రెండింటి వల్ల సమాజం మరింత అభివృద్ధి సాధించగలుగుతుంది.
మన మనసులో భావాలను వ్యక్తం చెయ్యాలంటే మన మాతృ భాషను మించినది వేరే భాష లేదంటారు. నవరసాలలోని అనుభూతిని మనకి తెలియజేసింది మన తెలుగు భాషనే కదా? అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు కదా? అటువంటి అమ్మను ఏదైనా అడగాలన్నా కూడా మనకు మన భాషే కావాలి.అటువంటి మాతృ భాష మీద మనం గౌరవం కలిగి వుండడం మన ధర్మం. మన పిల్లలకు మనం మన సంస్కృతి , సాంప్రదాయాలు తెలియజేయాలంటే ముందుగా మాతృ భాష మీద వారికి అభిమానం ఏర్పడేటట్టు చెయ్యాలి అమృతతుల్యమైన మన భాష ను కాపాడి మన ముందు తరాలకు ఇవ్వవలసిన భాధ్యతని మనందరిది.. ఆధునిక కాలంలో రాణించడానికి కావలసిన ఆంగ్ల భాషను నేర్చుకోవాలి. కాకపోతే మన భాషను మరువకూడదు.ఎందుకంటే మన భాష మన ఉనికి.. *మాతృ భాషని ప్రేమించలేనివాడూ, రానివాడూ ఆత్మ లేని శరీరం లాంటి వాడు.*