హైదరాబాద్, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొడుకు ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోయాడు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిళిండ్ ఆనంద్‌ను రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అతన్ని రూ. 25 లక్షలకు దక్కించుకుంది._
సైకిల్ నేర్చుకుంటానని వెళ్లి బాలుని మిస్సింగ్
భువనగిరి, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):
భువనగిరి పట్టణం హనుమాన్ వాడ కు చెందిన దోగీపర్తి గణేష్ (13) అనే బాలుడు కనిపించడంలేదని భువనగిరి పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.బాలుని తండ్రి హరి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గణేష్ భువనగిరి పట్టణములో మాంటిస్సోరి ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. సైకిల్ నేర్చుకుంటా…అని ఇంటి నుండి బయటకు వెళ్ళి ,ఎక్కడికో వెళ్లిపోగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుని ఆచూకీ తెలిసిన వాళ్ళు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగలరని కోరారు.
భువనగిరి ఇన్స్పెక్టర్ , సెల్ నెంబర్: 9440795645 కు గాని పొలీస్ స్టేషన్ నంబర్: 8500664003 కు కాల్ చేయాలని చెప్పారు.