ప్రెస్-పోలీస్.. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ – పోలీస్ జట్టు ఘనవిజయం
73వ గణతంత్ర దినోత్సవాన్ని, పురస్కరించుకుని చిగురుమామిడి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ అండ్ పోలీసుల, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ జట్టు ఘన విజయం సాధించింది మొదట ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, టాస్ వేయగా విలేఖరుల జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది.
12 ఓవర్లలో 86 పరుగులు చేసి నాలుగు వికెట్లు నష్టపోయింది, అనంతరం బరిలోకి దిగిన పోలీసులు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, ఆటలు తన భుజస్కంధాలపై వేసుకుని బ్యాటింగ్ బౌలింగ్ లోనూ సూపర్ ఫామ్ కొనసాగించారు 10 ఓవర్లలోరెండు ఓవర్లు మిగిలి ఉండగా 86 పరుగుల,లక్ష్యం సునాయాసంగా చేధించారు ఈ సందర్భంగా గెలిచిన జట్టుకు ఎంపిపి కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి రెండు వేల నగదు ప్రోత్సాహక బహుమతిని పోలీస్ జట్టుకు అందించారు రన్నర్ గా విలేకరుల జట్టుకు, బహుమతిని క్రీడా నిర్వాహకులు అందించారు. గెలుపొందిన జట్టుకు నగదుతో పాటు సీల్డ్ ను ఎస్సై దాసరి సుధాకర్ కు ఎంపీపీ ఎమ్మార్వో ఎంపీడీవో వైస్ ఎంపీపీ సర్పంచులు అభిమానులు చేతులమీదుగా అందించారు. ఈ ఆటకు వ్యాఖ్యాతగా పెద్ద పెళ్లి భవాని అరుణ్ కుమార్ వ్యవహరించారు. ఇరు జట్లులో పాల్గొన్న క్రీడాకారులు తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, మానకొండూరు సీఐ, కృష్ణారెడ్డి తిమ్మాపూర్ ఎస్ ఐ ప్రమోద్ రెడ్డి, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, అలాగే ప్రెస్ జట్టులో ఈనాడు విలేఖరి పరుశరాములు, సాక్షి విలేకరి బాలయ్య, నమస్తే తెలంగాణ విలేకరి ప్రకాష్, ఆంధ్రజ్యోతి వెంకటస్వామి, టీవీ ఫైవ్ రిపోర్టర్ బంట్ల శ్రీనివాస్, రఘునాధ రెడ్డి, రఫీక్, కరుణాకర్, పి, ఆర్ ,పి, రమేష్, క్రాంతి, మహేష్, అశోక్ , చిట్టెంపల్లి శ్రీనివాస్, దాసు, భొలుమల రాజమౌళి, శేషం నరసింహాచారి,శేషం నవీన్ కుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.