యాదాద్రి భువనగిరి, జూలై 7 ( రోమింగ్ న్యూస్):
యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్. వీ. ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ పదో తరగతిలో అత్యున్నత ప్రమాణాలతో ఉత్తీర్ణత సాధించినవిద్యార్థినీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి లు అభినందించారు. గురువారం ఆమె కలెక్టరేట్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్య్రమంలో విద్యార్థులను సన్మానించారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో విద్యనభ్యసించి మంచి జీపీఏ సాధించిన తిరుపతి నాయక్,శృతి రాథోడ్, చిన్నదాసు లను జ్ఞాపిక, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్.వీ.ఎన్ రెసిడెన్షియల్ హై స్కూల్లో చదువుకుని మంచి మార్కులు సాధించి ఇక్కడ అందరి ముందు ఆమె అభినందనలు సత్కారాలు పొందడం ప్రశంసనీయమన్నారు ఇదే స్ఫూర్తితో చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆమె ఆకాంక్షించారు క్రమశిక్షణతో కూడిన విద్య వల్ల మంచి నాణ్యత కలిగిన విద్య అందుకునే అవకాశం కలుగుతుందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్ ను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందిస్తూ ముందుకు సాగుతున్న అందుకు జీవితం ధన్యమని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి మంగ్తనాయక్ మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతిలో అత్యున్నత ప్రమాణాలు సాధించినట్లుగానే భవిష్యత్తులో కూడా మంచి విద్యను అందుకొని బంగారు బాట వేసుకోవాలి అని కోరారు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలల్లో చేరేందుకు నోటిఫికేషన్ జారీ అయిందని పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకొని సీట్లు కైవసం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి శాఖ ఏఓ శాంతి కుమార్, సైదా, గిరి తదితరులు పాల్గొన్నారు
.