పున ప్రారంభం జూలై 18న
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు.
హైదరాబాద్, జూలై 13 ( రోమింగ్ న్యూస్):
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి టెక్నికల్, రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయి వరకు సెలవులు వర్తించనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే మూడు రోజుల పాటు ఇచ్చిన సెలవులు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో మరో మూడు రోజులు(జూలై 14,15,16) పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు… వర్షాల కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కరుణ పేర్కొన్నారు. వర్షాల కారణంగా తొలుత జులై 11 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించింది. అయితే వాతావరణ పరిస్థితులు అదే తీరులో కంటిన్యూ అవుతున్నందున విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జులై 14 నుంచి 16 వరకు కూడా సెలవులను పొడిగిస్తున్నట్లు వాకాటి కరుణ స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్లు ఆమె వివరించారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో నిర్ణయం జరగనున్నది. ఈ సమయంలో విద్యాసంస్థలు అన్నింటికీ సెలవులు ప్రకటించడం గమనార్హం. అన్ని విద్యా సంస్థలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.