దేశానికి స్వాతంత్రమ సిద్దించి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్ లో విద్య శాఖ, పోలీస్, RTO, మున్సిపల్,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పాఠశాల పిల్లలందరికి 9 రోజులలో గాంధీజీ సినిమాను చూపించేందుకు జిల్లాలోని 9 దియేటర్లను ఎంపిక చేసి సంబందిత ఏర్పాట్లను పూర్తి చేసిన్నట్లు ఆమె తెలిపారు.
ఈ నెల 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు 3 రోజులు 16 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు 6 రోజులు మొత్తం కలిపి 9 రోజులు, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మహాత్మా గాంధీ సినిమా చూపించేందుకు జిల్లా విద్య శాఖ అధికారి , సంబందిత అధికారులు సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేసిన్నట్లు , సినిమా ఉదయం 10 గంటల నుండి 01.15 వరకు ఉంటుందని పాఠశాల నుండి సినిమా ధియేటర్స్ కు తీసుకవచ్చి, సినిమా తిలకించిన తరువాత తిరిగి వారిని పాఠశాలలో వదిలే విధంగా బస్సులను ఏర్పాటు చేసిన్నట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు 3,610 మంది పిల్లలు సినిమా తిలకించేoదుకు ధియేటర్ వారీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన్నట్లు ఆమె తెలిపారు.
పాఠశాల పిల్లలను సినిమా ధియేటర్ కు తీసుకవెళ్లిన తరువాత పోలీస్ సిబ్బంది ఒకరు, రెవెన్యూ సిబ్బందిని ఒక్కరూ, RTO నుండి ఒకరు, మున్సిపాలిటీ నుండి ఒకరు సంబందిత పాఠశాల ఉపాధ్యాయులు ఒకరు పిల్లలతో ఉంటారని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి పాఠశాలకు చేర్చాలని కలెక్టర్ సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ACP వెంకట్ రెడ్డి, జిల్లా విద్య శాఖ అధికారి నారాయణ రెడ్డి, RTO , కొ-ఆర్డినేటర్ ఆండాలు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఖాజా మైనుద్దీన్, MEO లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సభ్యులు , సంబందిత అధికారులు పాల్గొన్నారు.