RN DAILY     G9 TELUGU TV    ePaper

ఎస్.వీ.ఎన్ లో ఘనంగా తెలంగాణ మలి దశ పోరాటయోధురాలు 11వ వర్ధంతి

కదిలే దేవత అమ్మ: గొట్టిపర్తి మాధురి

అమ్మ ప్రేమను వర్ణించిన చిన్నారులు

యాదగిరిగుట్ట, ఆగస్టు 6 (రోమింగ్ న్యూస్):

తెలంగాణ మలిదశ పోరాట యోధురాలు గొట్టిపర్తి లక్ష్మీ 11వ వర్ధంతిని యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ. ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఉద్యమాల పురిటి గడ్డ కొలనుపాకలో జన్మించి యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో తన మెట్టినింట కుటుంబాన్ని ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నదని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు అన్నారు. మొదటగా గొట్టిపర్తి లక్ష్మమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థిని విద్యార్థులు అమ్మతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గొట్టిపర్తి కుటుంబానికి పెద్దదిక్కుగా అందరి మన్ననలను అందుకొని తన జీవితాన్ని ఫలవంతం చేసుకున్నదని వివరించారు.

అందరికీ ఆదర్శం లక్ష్మమ్మ

తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో ఎన్నో క్రియాశీల ఉద్యమాలలో పాల్గొని ఆదర్శంగా నిలిచిందని ఎస్.వీ ఎన్ వ్యవస్థాపకులు, కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్ చెప్పారు. మలిదశ ఉద్యమంలో ఆలేరు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గా అమ్మ నన్ను ప్రభావితం చేయడం వల్లనే ఉద్యమాల్లో పాల్గొన్నానని ఆయన వివరించారు. పోలీసు కేసులకు బెదరకుండా తెలంగాణ ఉద్యమంలో మమేకేమైన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మానుకోటకు ఏకంగా రైలులో బయలుదేరిన ప్రస్తుత ఏపీ సీఎం, వైయస్సార్ సీపీ వైయస్ జగన్ను గుట్ట మండలం వంగపల్లిలో రైలును ఆపినప్పటి నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ సాధనలో నిర్ణాయక పాత్ర పోషించానని చెప్పారు. నాటి రోజుల్లో అనేక ఉద్యమాలకు ఆలేరు మండలంలోని కొలనుపాక కేంద్రబిందువుగా ఉన్నదని ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి పోరాట యోధులను కన్న కొలనుపాక గొట్టిపర్తి లక్ష్మమ్మ కు కూడా జన్మస్థానంగా నిలిచిందని చెప్పారు. నాడు నైజాములకు వ్యతిరేకంగా ఉద్యమించి ఈ ప్రాంత విముక్తి లో ఆమె భాగస్వామి అయిందన్నారు.

కదిలే దేవత అమ్మ: గొట్టిపర్తి మాధురి

కదిలే దేవత అమ్మ అని గొట్టిపర్తి లక్ష్మీ నిరూపించిందని ఎస్.వీ.ఎన్ డైరెక్టర్
గొట్టిపర్తి మాధురి అన్నారు. ఎంతో సంయమనంతో …ఎంతో ఓర్పుతో గొట్టిపర్తి కుటుంబాన్ని నడిపి అందరికీ మార్గం చూపించిందని చెప్పారు. దేవుడు అంతటా ఉండలేక అమ్మను సృష్టించాడని అయితే ఆమె నాకు అత్త రూపంలో నా జీవితంలో చెరగని ముద్ర వేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ గొట్టిపర్తి వృతిక్, గొట్టిపర్తి బాలు, బైరి నరసింహులు, బైరి విజయ, బైరి ప్రవల్లిక, గొట్టిపర్తి రజినీ, గొట్టిపర్తి భవాని, భార్గవి, హరీష్, ఎస్.వీ.ఎన్. ఉపాధ్యాయులు శ్యామకుమారీ, గీత, మహేశ్వరి, పి. గీత, వైష్ణవి, సరళ, రజిని, నిఖిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.
ఎం.డీ యూసుఫ్, జే.హరీష్, నవీన్, ఆర్.పీ, పీ.ఈ.టీ భరత్ తదితరులు మాట్లాడారు.

అమ్మ ప్రేమను వర్ణించిన చిన్నారులు

గొట్టిపర్తి లక్ష్మి 11వ వర్ధంతి సందర్భంగా ఎస్.వీ ఎన్ లో చదువుతున్న విద్యార్థులు అమ్మ ప్రేమను వర్ణిస్తూ ప్రసంగించారు. అమ్మ గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీలలో తమకు తమ అమ్మలతో గల అనుబంధాన్ని ప్రేమను… బాధ్యతను గుర్తు చేసుకున్నారు. ఒక్కో విద్యార్థినీ ఎంత కష్టపడి తమ తల్లులు తాము ఉన్నత స్థితికి చేరుకోవాలో చెప్పిన తీరు వారిలోని ప్రేమను వ్యక్తం చేసింది. కొంత మంది విద్యార్ధులు,టీచర్లు తమ అమ్మల గురించి చెబుతూ కంట నీరు పెట్టుకున్నారు. ఎస్.వీ. ఎన్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ అమ్మ గురించి వర్ణిస్తూ….

అమితమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అలుపెరగని ఓర్పు అమ్మ
అద్భుతమైన స్నేహం అమ్మ
అపురూపమైన కావ్యం అమ్మ
అరుదైన రూపం అమ్మ
కదిలే దేవత అమ్మ
కదిలించే కంటి వెలుగు అమ్మ
నా జీవితానికి గెలుపు అమ్మ
అమ్మే నాకు తొలి దేవత… తొలి గురువు
అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!