సీఎం కేసిఆర్ చొరవతో పరిష్కారం: అల్లం నారాయణ
హైదరాబాద్, రోమింగ్ న్యూస్:
జర్నలిస్టులకు హైదరాబాదులో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పుతో జర్నలిస్టుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. చీఫ్ జస్టీస్ గా రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో చారిత్రాత్మక తీర్పును ఇచ్చారు.

జర్నలిస్టులకు ఊరట లభించిన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ,

సలహాదారులు క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, టెంజు అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ ,కార్యదర్శి రమణ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కే సీ ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేద్దాం
ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం కానున్న నేపథ్యంలో ఇక జిల్లాలలో కూడా అన్ని అడ్డంకులు తొలగవచ్చని భావించవచ్చు. ప్రభుత్వ తరఫున ప్రతి జర్నలిస్టు కి సొంతింటి కల సాకారం కానున్న ప్రస్తుత నేపథ్యంలో ఇందుకు ప్రత్యక్షంగా కృషిచేసిన, చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన సంఘం తరఫున గౌరవార్థంగా పాలాభిషేకం చేయడం మన ధర్మం గా భావిస్తూ జిల్లా బాధ్యులు ఆయా జిల్లా కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని మన సంఘం రాష్ట్ర కమిటీ భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు.
