శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మొత్తం ఎత్తడంతో పర్యాటకులు భారీగా శ్రీశైలం కు తరలి వెళ్లడంతో ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి. ఈగలపెంట నుంచి శ్రీశైలం కు ఐదు గంటల సమయం పట్టిందంటే పర్యాటకులు ఎంత పెద్ద సంఖ్యలో శ్రీశైలంకు తరలివచ్చారో అవగతమవుతుంది. ఒక వైపు శ్రీశైలం మల్లన్న దర్శనం మరోవైపు కనుల కింపైన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు తరలి వెళ్తున్న కృష్ణమ్మ పరవళ్ల పాలపొంగు చూసి తరించాలన్న తపనతో భారీగా పర్యాటకులు శ్రీశైలం పాట పట్టారు. దాంతో పర్యాటకుల సందడి నెలకొన్నది. ఫలితంగా ఈగలపెంట నుంచి శ్రీశైలం కు వెళ్లడానికి 5 గంటల సమయం పట్టింది పోలీసులు చేతులెత్తేయడంతో పర్యాటకుల పరిస్థితి దారుణంగా తయారైంది పెరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అంటూ ఆందోళన చెందారు. మా శ్రీశైలం ప్రతినిధి మల్లికార్జున అందించిన ఫోటోలు మీకోసం…

