యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:
స్వచ్ఛదనం… పచ్చదనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ఆలేరు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యదనం… పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందర్నీ భాగస్వాములను చేస్తున్నదని చెప్పారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమేంద్ర గౌడ్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి లు ఏర్పాటుచేసిన పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. పట్టణంలోని అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది అందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.