గుట్టలో ఎస్.వీ.ఎన్ స్టూడెంట్స్ తీరంగా ర్యాలీ2000 ఫీట్ల జాతీయ పతాకంతో ఎస్.వీ.ఎన్ స్టూడెంట్స్ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఏసీబీ రమేష్ కుమార్ తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎండిఓ నవీన్ కుమార్, సీఐలు రమేష్ కుమార్, రవి కుమార్

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:

: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తిరంగా ర్యాలీని ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముక్తాల ఫౌండేషన్ మరియు ఎస్.వీ.ఎన్ డిజిటల్ హైస్కూల్ లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్, యాదగిరిగుట్ట తిరుమల నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ గిరిధర్ లు ప్రారంభించారు.

త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.2000 ఫీట్ల జాతీయ పతాకం పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. యాదాద్రి ఏసిపి రమేష్ కుమార్ తహసిల్దార్ వెంకటేశ్వర్లు, నాయబ్ తహసిల్దార్ నరసింహారావు, మండల అభివృద్ధి అధికారి నవీన్ కుమార్, సూపరిండెంట్ వెంకటరమణ సలీం లు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.


పట్టణ సీఐ రమేష్, ట్రాఫిక్ సిఐ రవికుమార్ పలువురు ఎస్ఐలు విద్యార్థులతో కలిసి పథకాన్ని పట్టుకొని వైకుంఠ ద్వారం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. సందర్భంగా మక్తల ఫౌండేషన్ అధ్యక్షులు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యాపారం పేరుతో ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారు భారతదేశాన్ని లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్.వీ.ఎన్ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతోపాటు దేశభక్తి దేశం పట్ల అభిమానం కలగడం కోసం తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు.

ఇది యాదగిరిగుట్ట చరిత్రలో సరికొత్త సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పలికిందని ఎవరు చేయలేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్ననలు పొందడం విశేషం అని చెప్పారు. విద్యార్థుల యొక్క ధైర్య సాహసాలు… సాధించాలన్న పట్టుదల కారణంగానే ఇది విజయవంతమైందని చెప్పారు.

ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, డైరెక్టర్ గొట్టిపర్తి వృతీక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.