ట్రస్మా కేర్ టేకింగ్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్
విద్యా కమిషన్ చైర్మన్ మురళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం
హైదరాబాద్, రోమింగ్ న్యూస్: వార్షికంగా 50 వేల రూపాయల కంటే తక్కువ ఫీజు కలిగిన బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ నుంచి మినహాయించాలని ట్రస్మా కేర్ టేకింగ్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ స్కూల్స్ లో విద్యా పరిస్థితుల చర్చించేందుకు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సభ్యులు జ్యోత్స్న, డాక్టర్ విశ్వేశ్వర రావు లతో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సాదుల మధుసూదన్ మాట్లాడారు.
బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన వివరణాత్మకమైనటువంటి సూచనలు చేశారు. ఫీజుల వసూలు మొదలు అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత… నిర్బంధ నిర్బంధనలు.. తదితర అంశాలపై ఆయన వారి దృష్టికి తీసుకువచ్చారు.
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఆదరించి వారిలో విద్యా వికాసం కలిగిస్తున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ గ్రామీణ, పట్టణాల్లోని బస్తీలలో చేస్తున్న కృషిని ఆయన వివరించారు. నిబంధనల విషయంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలల నుంచి విడదీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సిబిఎస్ఈ .. ఇతర వ్యాపార దృష్టితో ఏర్పాటు చేసిన కార్పొరేట్ స్కూల్స్ ఫీజు లపై నియంత్రణ ఉండాలని ఆయన సూచించారు. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించే రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ శిక్షణల కల్పన కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైన్స్, కంప్యూటర్, రోబోటిక్స్ లైబ్రరీ వంటి ల్యాబ్ లను పాఠశాలలలో అప్డేట్ చేసేందుకు తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
దీనివల్ల నాణ్యమైన విద్య అందడంతో పాటు విద్యా విధానంలో వస్తున్న అధునాతన టెక్నాలజీని సాధారణ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు అందుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఫీజు వసూలు హక్కును విద్యా విధానంలో చేర్చడం అవసరమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలు 1100 వరకు ఉంటాయని ఆ నిబంధనలను సాధారణ బడ్జెట్ స్కూల్స్ కు
పజేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎన్ఓసీల పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి కూడా ఆయన వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, పల్లె వినయ్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, జీతూ ప్రసాద్, దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు, విద్యావేత్తలతో ఈ సమావేశం జరిగింది.