ఎస్.వీ.ఎన్ అంటే క్రమశిక్షణ
ఎస్.వీ.ఎన్ అంటే పట్టుదల
ఎస్.వీ.ఎన్ అంటే ఏకాగ్రత అని చాటిన పూర్వ విద్యార్థులు
ఘనంగా 2004- 2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
యాదగిరిగుట్ట, జనవరి 5 (రోమింగ్ న్యూస్):భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఎస్.వీ.ఎన్ ముందున్నదని గత 29 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దిందని యాదగిరిగుట్ట ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు.
యాదగిరిగుట్టలో ఆదివారం 2004_ 2005 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1995లో ప్రారంభమైన ఎస్.వీ.ఎన్ ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపినదని చెప్పారు. సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణ… దేశభక్తిని రంగరించడంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నదని చెప్పారు.
యాదగిరిగుట్టలో ఎవరు చేయని విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కళారూపాల ద్వారా ప్రదర్శించి దేశభక్తిని రంగరించామని చెప్పారు. నాటి కార్గిల్ వార్ నుంచి మొదలుకొని స్వాతంత్ర సమరంలో అమరులైన వీరుల బాధలను తెలిపే ఎన్నో ఇతివృత్తాలను తీసుకొని కళారూపాలుగా మలిచి ప్రదర్శించిన ఘనత ఎస్.వీ.ఎన్ విద్యార్థులకే దక్కిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోను దూం…ధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేసిందని చెప్పారు.
ఈ దేశానికి అవసరమైన ఒక సివిల్ సర్వెంట్ ను, వందలాది మంది ఇంజినీర్లను డాక్టర్లను ఈ దేశానికి అవసరమైన అత్యుత్తమ పౌరులను అందించిందని చెప్పారు.
నాడు నేర్చుకున్న కళారూపాలు మాలో చైతన్యం నింపాయి
నాటి కళారూపాల ప్రదర్శనలు ప్రత్యక్షంగా పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు నాడు నేర్చుకున్న కళారూపాలు మాలో చైతన్యం నింపాయి… మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయని చెప్పారు. నాడు స్కూల్లో నేర్చుకున్న దేశభక్తి తమ పిల్లలకు కూడా రంగరింప చేస్తున్నామని వారు ఈ సందర్భంగా చెప్పడం గమనారం. విద్యార్థి లోకంలో స్పందన, జాగృతి, చైతన్యం లక్ష్యాలను కలిగించడం తద్వారా సమాజ చైతన్యానికి నాంది పలకడం అనేటువంటి అవకాశాలను తీసుకొని ముందుకు సాగడం వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల పేద పిల్లలను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దినదని చెప్పారు.
క్రమశిక్షణ కోసం భాస్కర్ సార్ కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని నాటి క్రమశిక్షణ వల్లనే పట్టుదల, ఏకాగ్రత అలవడ్డాయని చెప్పారు. సర్ వల్లనే తాము ఉన్నత స్థాయిలో నేడు జీవిస్తున్నామని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా చెప్పడం విశేషం. పూర్వ విద్యార్థిని డాక్టర్ ఆసూరి మరీంగంటి వైష్ణవి మాట్లాడుతూ తాను ఈ దేశం కోసం పాటుపడాలన్న తపన నేర్చుకున్నది భాస్కర్ సార్ ద్వారానే చెప్పారు. అద్భుతమైన దేశభక్తిని సార్ నుంచి అలవర్చుకున్నానని చెప్పారు.
సంప్రదాయాలను మా కుటుంబం నుంచి నేర్చుకున్నప్పటికీ అంతకుమించినటువంటి పట్టుదల, ఏకాగ్రత, ఇతరులకు సహాయ పడాలన్న వ్యక్తిత్వం నేను స్కూల్లో నేర్చుకున్నదేనని చెప్పారు. బండి అనిల్ మాట్లాడుతూ పాచ్యాత్య సాంస్కృతిక పోకడలను వ్యతిరేకించడమే కాకుండా ఈ దేశం ఔన్నత్యాన్ని గురించి మొట్టమొదటగా ఎస్.వీ.ఎన్ లో భాస్కర్ సార్ నేర్పించిన విషయాన్ని ఆయన ఉదహరించారు. ఇదే విషయాన్ని వేముల గౌతమి, నరసిహ్మశర్మ, కొరటికంటే రాజేశ్వరి, తాడూరి నవనీత, మొలుగు స్రవంతి, బుట్ రెడ్డి రజిని, మిట్ట హరిప్రియ, బీ. శ్రీలత, బీ. స్వాతి, డీ. శ్రీవాణి, పార్వతి, ప్రేమలత, పైల్ల సత్యవతి, బొజ్జ రజిని ఏషమైనమైన సురేష్, కన్నాయి చందన, బీ. శివశంకర్ గుజ్జ అర్చన, నోముల శ్రీశైలం, డీ.వెంకటేష్, గౌటి రాజశేఖర్ కూడా చెప్పారు.
భాస్కర్ సార్…మాధురి మేడంతో పాటు ఉపాధ్యాయులకు ఘన సన్మానం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎస్ఎ.వీ.ఎన్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ మాధురిలను శాలువాలు… పూలమాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆ సమయంలో గణితం బోధించిన రామచందర్, హిందీ బోధించిన అశోక్, సైన్స్ బోధించిన భాగ్య, సోషల్ బోధించిన అశోక్ తదితర ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా పూలమాలలు… శాలువాలతో సన్మానించారు.ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ డైరెక్టర్ గొట్టిపర్తి వృతిక్ ను కూడా పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.