RN DAILY     G9 TELUGU TV    ePaper

సమర్థవంతమైన బోధన కోసం శిక్షణలు

విజయవంతమైన జోగులాంబ గద్వాల్ జిల్లా టీచర్ల శిక్షణ కార్యక్రమం

జోగులాంబ గద్వాల, రోమింగ్ న్యూస్:
చిన్నారుల్లో పునాది విద్యను సమర్థవంతంగా బోధించడానికి ప్రగతిశీల పద్ధతులను టీచర్లకు అందించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా తాము ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ వెల్లడించారు.
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మరియు వండర్ కిడ్స్ సంయుక్తంగా నిర్వహించిన టీచర్ల శిక్షణా కార్యక్రమం ఆదివారం జోగులాంబ గద్వాల్ జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో 650 మందికి పైగా టీచర్లు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా సాధుల మధుసూదన్ మాట్లాడుతూ
650 మందికి పైగా టీచర్లు చురుకుగా పాల్గొనడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో
బోధనలో కచ్చితంగా నైపుణ్యాలు పెరుగుతాయని చెప్పారు.


టీచర్లను ఆధునిక, విద్యార్థి-కేంద్రిత బోధనా పద్ధతులతో ప్రేరేపించడం వల్ల విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుందని చెప్పారు.
సాహిత్య, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడం వల్ల గణిత బోధన సులువు అవుతుందని చెప్పారు.సృజనాత్మకత మరియు భావనాత్మక అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నట్లవుతోందన్నారు.
ఆటల ద్వారా విద్యా పద్ధతులు వినియోగించడం వల్ల చదువుపై ఇష్టం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ
టీచర్లు ఈ శిక్షణను ఎంతో ఉపయోగకరంగా భావించారు. కృషి-ఆధారిత, పిల్లల స్నేహపూర్వక బోధన పద్ధతులు తరగతులలో వినియోగించడానికి తమకు గొప్ప మార్గదర్శకత్వం కలిగించిందని అభిప్రాయపడ్డారు.

నో బ్యాగు… నో హోంవర్క్ పద్ధతి

వైజాగ్ వండర్ కిడ్స్ వ్యవస్థాపకులు.
మల్లూ వాణి రామనాయుడు దంపతులు మాట్లాడుతూ

తమ వండర్ కిడ్స్ సంస్థలో నో బ్యాగు… నో హోంవర్క్ పద్ధతి ఫాలో అవుతున్నామని చెప్పారు. అయినా ప్రీ ప్రైమరీ విద్యార్థులు, ప్రైమరీ విద్యార్థులకు పోటీగా పరీక్షలు రాసే నైపుణ్యాలను పొందుతున్నన్న విధానాన్ని ఉదాహరణలతో సహా వివరించారు.

విద్యార్థులకు ఇష్టంతో కూడిన బోధన సాగించడం కోసం చేస్తున్న ప్రయోగాలను ఆయన విజువలైజేషన్ ద్వారా టీచర్లకు ప్రాజెక్టర్ లో చూపిస్తూ వివరించారు.

క్రియేటివిటీ తో బోధన చేయాలి: కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ట్రస్మా రాష్ట్ర సలహాదారు మరియు తెలంగాణ గ్రీన్ అంబాసిడర్ కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 21 సెంచరీ పిల్లలకు భోధన చేయడం కోసం ఉపాధ్యాయులు తమకు తాముగా అప్డేట్ కావలసిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణించారు.
ఎప్పటికప్పుడు పోటీ ప్రపంచంలో అద్భుతమైన బోధనను కొనసాగించాలంటే కొత్త విషయాలను నేర్చుకోవడం… టెక్నాలజీతో వాటిని అనుసంధానం చేసి భోదించడం అవసరమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శిక్షణ కార్యక్రమంలో
పాఠశాల ప్రతినిధులు


అనేక పాఠశాలల కరస్పాండెంట్లు మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు,

శిక్షణతో విద్య ప్రమాణాల పెంపు ఖాయం: ఉపాధ్యాయులు

విద్యా ప్రమాణాల అభివృద్ధి పట్ల తమకు ఎంతో నమ్మకం కలిగిందని చెప్పారు. టీచర్లు విద్యార్థి-కేంద్రిత బోధన పద్ధతుల ప్రభావాన్ని అభినందించినట్లు చెప్పారు. ఆటలతో బోధన మరియు కార్యకలాపాల ఆధారిత పద్ధతులు పిల్లల అభివృద్ధికి కొత్త మార్గాలను చూపుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం తెలంగాణలో పునాది విద్యా రంగాన్ని మార్పు చేయడంలో ట్రస్మా చేస్తున్న ప్రగతిశీలమైన ప్రయత్నానికి నిదర్శనమని
ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఆధునిక సాధనాలు, పద్ధతులతో టీచర్లను సిద్ధం చేయడం ద్వారా చిన్నారుల నైపుణ్యాల మెరుగుదల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ట్రస్మా జిల్లా అధ్యక్షులు బాబు నాయుడు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి
మోయిన్ భాష,కోశాధికారి రమేష్, ట్రస్మా నాయకులు
మురళీధర్ రెడ్డి, నందు,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!