ట్రస్మా జనరల్ బాడీ సమావేశానికి రావాలని ఆహ్వానం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా ఆహ్వానించిన ట్రస్మా
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ లకు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కూడా ఆహ్వానం పలికిన ట్రస్మా
సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ … పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
జనరల్ బాడీ తేదీని త్వరలో ప్రకటించనున్న ట్రస్మా
హోంశాఖ సెక్రటరీ రవిగుప్తాతో బడ్జెట్ స్కూల్స్ భద్రతపై చర్చ
విద్యాశాఖ శ్రీధర్ తో విద్యా ప్రణాళికలపై చర్చించిన ప్రతినిధులు
హైదరాబాద్, జనవరి 3 (రోమింగ్ న్యూస్):తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి లను కూడా కలిసి జనరల్ బాడీ కి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాధుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పీ. రాఘవేంద్ర రెడ్డి, ఎన్నికల కమిషన్ చైర్మన్ నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, సతీష్, ప్రభాకర్ రెడ్డి, గుల్షన్ మరియు రాజేష్ పాల్గొన్నారు. సందర్భంగా విద్యా రంగంలో నాణ్యతను మెరుగుపరచడం, పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన విధానాలను రూపొందించడం వంటి ముఖ్య అంశాలు సీఎం తో చర్చించారు.
జనరల్ బాడీ సభకు రావాలని సీఎంకు ఆహ్వానం
ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించే జనరల్ బాడీ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రస్మా ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో జనరల్ బాడీని వేలాదిమంది ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లతో నిర్వహించనున్న విషయాన్ని సీఎంకు, మంత్రులకు, పీసీసీ ప్రెసిడెంట్ కు ట్రస్మా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ వివరించారు.ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు సాధుల మధుసూదన్ మాట్లాడుతూ, “తెలంగాణ విద్యారంగం భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ చర్చ చారిత్రాత్మకమైనదని” అభిప్రాయపడ్డారు. ట్రస్మా రాష్ట్రంలోని విద్యా స్థాయిని మెరుగుపరచేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు
పలువురు ఉన్నతాధికారులను కలిసిన ట్రస్మా ప్రతినిధులు
విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్. శ్రీధర్ మరియు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేనలను కూడా కలిశారు
హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా తో బడ్జెట్ స్కూల్స్ భద్రతపై చర్చ
ప్రైవేట్ స్కూల్స్ పై అసాంఘీక శక్తులు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని హోం శాఖ సెక్రెటరీ రవిగుప్తాతో ట్రస్మా ప్రతినిధి బృందం చర్చించింది. ఈ సందర్భంగా రవిగుప్తాకు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ చేస్తున్న విద్యా సేవను గురించి కూడా వివరించారు. తప్పకుండా ఖచ్చితమైన భద్రతను బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కు అందజేస్తామని ఈ సందర్భంగా రవిగుప్తా హామీ ఇచ్చారు.విద్యా శాఖ కార్యదర్శి శ్రీధర్ తో జరిగిన చర్చల్లో విద్యాభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం,విద్యా సంస్థలు మరియు విద్యా బోధకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం…విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.