ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హాజరు హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్
పలువురు ఎమ్మెల్యేలు… ఎమ్మెల్సీలు రాకకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్రస్మా నేతలు
పటాన్ చెరు, రోమింగ్ న్యూస్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సభ బుధవారం నిర్వహించనున్నారు. పటాన్ చెరులోని ఎస్.వీ.ఆర్ గార్డెన్స్ లో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నామనిరాష్ట్ర అధ్యక్షులు సాధుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్ రావు, రాష్ట్ర కోశాధికారి పి. రాఘవేంద్ర రెడ్డి లు తెలిపారు.సోమవారం పఠాన్ చెరులోని ఎస్.వీ.ఆర్ గార్డెన్స్ లో ఏర్పాట్లను పర్యవేక్షించిన సందర్భంగా వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గౌరవ అతిథులుగా రోడ్లు, భవనాలు, సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రత్యేక ఆహ్వానితులుగాపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రికి సలహాదారు వేమ నరేందర్ రెడ్డి,పటాన్‌చెరు ఎమ్మెల్యేజి. మహిపాల్ రెడ్డి,వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నైనీ రాజేందర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,జె డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. రామ్ చంద్ర నాయక్, శాసనమండలి సభ్యులు, ప్రొఫెసర్ ఎం. కోదండరాం,శాసనమండలి సభ్యులు ఏవీఎన్ రెడ్డి తదితరులు హాజరవుతారని చెప్పారు.కార్యక్రమం షెడ్యూల్:భోజనం: మధ్యాహ్నం 1:00 నుండి 2:00 గంటల వరకుసమావేశం: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకుఈ సమావేశంలో విద్య, పాఠశాల నిర్వహణ, మరియు తెలంగాణలోని విద్యా రంగంపై ప్రభావం చూపుతున్న విధానాలపై ప్రధానమైన చర్చలు జరుగనున్నాయి. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ట్రస్మా సలహాదారులు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లె వినయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.