
యోగితారాణా ను కలిసిన ట్రస్మా
హైదరాబాద్, 28 జనవరి(రోమింగ్ న్యూస్): తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్ రావు, మరియు రాష్ట్ర సలహాదారులు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణిని కలిసి ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలలో సీజీపీఏ విధానాన్ని కొనసాగించేందుకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పల్లె వినయ్ కుమార్, మెడిచర్ల డైరెక్ట్ అధ్యక్షుడు రమేష్, జిల్లా కార్యదర్శి గుల్షన్, హైదరాబాద్ కార్యదర్శి రఘు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో నాయకులు CGPA విధానం విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. మార్కుల ఆధారిత విధానం అమలులోకి వస్తే, విద్యార్థుల్లో తీవ్రమైన పోటీ, ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.CGPA విధానం ముఖ్యమైన ప్రయోజనాలు: 1. ఒత్తిడి రహిత విద్య: CGPA విధానం విద్యార్థులను అవగాహన ఆధారిత అభ్యాసం పట్ల దృష్టిపెట్టేలా చేస్తుంది, మార్కుల కోసం పరుగు తీసే విధానాన్ని తగ్గిస్తుంది. 2. సమగ్ర మూల్యాంకనం: విద్యార్థులను ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు, తరగతి నిర్వహణలో పాల్గొనడం వంటి అనేక అంశాలపై అంచనా వేయడం వల్ల సమగ్ర అభివృద్ధి సాధ్యం. 3. అన్ని విద్యార్థులకు అనువైన విధానం: ప్రత్యేకించి సగటు మరియు తక్కువ మార్కులు పొందే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఉత్తమ ఫలితాలను సాధించేందుకు మార్గదర్శకం అందిస్తుంది.CGPA విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి TRSMA నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు విద్యా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని CGPA విధానాన్ని కొనసాగించాలని అధికారులను మేము కోరుతున్నాము.TRSMA విద్యా వ్యవస్థను మరింత విద్యార్థి-స్నేహపూర్వకంగా మార్చేందుకు, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉంది.Note. .అదేవిధముగా పరీక్షలు వ్రాసే జవాబు పత్రాలను తెల్ల పేపర్ కాకుండా cbse మరియు icse పరీక్షలలో ఉపగించే మాదిరిగా సింగల్ (రూల్ )లైన పేపర్ ని ఉపయోగించవాళ్లచిందిగా ట్రస్మా రాష్ట్ర సలహాదారులు కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
