విద్యార్థులకు ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ పిలుపు
గుట్ట ఎస్.వీ.ఎన్ లో ఘనంగా వీర శివాజీ జయంతి మహోత్సవం
సమాజ వికాసమే ఎస్.వీ.ఎన్ లక్ష్యం: డైరెక్టర్ వృతీక్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 19 (రోమింగ్ న్యూస్):ధైర్యానికి మారుపేరు, దేశ భక్తికి చిరునామాగా నిలిచిన వీర యోధుడు స్ఫూర్తి ప్రదాత చత్రపతి శివాజీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని యాదగిరిగుట్ట ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు. బుధవారం పాఠశాలలో నిర్వహించిన వీర శివాజీ జయంతి మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు, యువతకు స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పారు.ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా అమలు కాని పరిస్థితులలో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొగలాయిలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీర యోధుడు శివాజీ అని చెప్పారు.

దేశం కోసం…ధర్మం కోసం ప్రాణాలను అర్పించిన మరాఠా యోధుడు మహారాజ్ శివాజీ వారసత్వాన్ని విద్యార్థులు పునికి పుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ధైర్యం… స్ఫూర్తి… దక్షత సమస్త లోకానికి ముఖ్యంగా యువత, విద్యార్థులకు కలగాలని కోరుకుంతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవంలో విద్యార్థులు నలిగిపోతున్నారని అన్నారు. విశృంఖల స్వేచ్ఛను అనుభవిస్తూ తామేమిటో ఏం చేయాలనే విషయాన్ని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జిజియాబాయ్ తన కుమారునికి ఉగ్గుపాలతో దేశభక్తిని నూరు పోసిందని చెప్పారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో సరైన మార్గదర్శకత్వం వహించకపోవడం వల్ల సెల్ ఫోన్ లకు బానిసలుగా మారుతున్నారని చెప్పారు.

దీనిని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో మనోవికాసం కొరబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ గొట్టిపర్తి మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పేరెంట్స్ బాధ్యత తీసుకొని వారిని నిత్యం ఆలనా.. పాలన చూసినట్లయితే వారిలో బాధ్యత పెరుగుతుందని చెప్పారు. డైరెక్టర్ గొట్టిపర్తి వృత్తికి మాట్లాడుతూ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం సాధించి అగ్ర భాగాన పయనిస్తున్నదని, దీనికి విద్య కారణం అని చెప్పారు. విద్యా ఫలాలు అందరికీ అందడం కోసం ఎస్విఎన్ తనదైన శైలిలో 30 ఏళ్లుగా చేస్తున్న కృషిని ఆయన వివరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కార్యక్రమం ప్రారంభమైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. సమాజ వికాసం… సమాజ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎస్.వీ.ఎన్ లో తమ పిల్లలను చేర్పించినట్లయితే విద్యార్థుల భవితవ్యం బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు తానే చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక్కడ చదువుకొని విదేశాల్లో చదువుకొని విద్యాసేవ చేయడానికి ఇక్కడ పునరంకితమైన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వీర శివాజీ గొప్పతనాన్ని చాటుతూ ప్రసంగించారు.


