RN DAILY     G9 TELUGU TV    ePaper

విద్యతోనే మార్పు సాధ్యం: గుట్ట పట్టణ సీఐ రమేష్

వండర్ కిడ్స్ స్కూల్ లో అడ్మిషన్ల కోసం 8434242494 నంబర్లు సంప్రదించాలి

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జెండర్ ఈక్వాలిటీ ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి. గుట్ట బీసీ కాలనీలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. గుట్ట పట్టణ పోలీస్ సీఐ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు.

మహిళలు ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాలలో రాణించాలంటే విద్య తప్పనిసరి అని యాదగిరిగుట్ట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్ హైస్కూల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బీసీ కాలనీలో నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సభకు ఎస్.వీ.ఎన్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ అధ్యక్షత వహించారు.

నేటి ఆధునిక యుగంలో కూడా కొంతమంది ఈక్వాలిటీ విషయంపై చర్చ చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సగభాగంలో ఉన్న మహిళలకు అదే స్థాయిలో హక్కులు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆడ, మగ తేడా లేకుండా సమాన స్థాయిలో ఆడపిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని ఆయన వివరించారు. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలోకి వెళుతుందని చెప్పారు.

ఇప్పటికీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే ఉన్నదని గుర్తు చేశారు. దానికి మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, వెనుకబాటుకు గురి కావడమేనని చెప్పారు. విద్యార్థి దశలో ఆడపిల్లలకు చేయూతనిచ్చినట్లయితే చక్కటి పౌరులుగా తయారవుతారని చెప్పారు. సహజంగా మహిళలకు మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారికి అవకాశాలు కల్పించినట్లయితే వారి టాలెంట్ చూపిస్తారని చెప్పారు. ఎస్వీ అండ్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ మాట్లాడుతూ 29 సంవత్సరాల నుంచి విద్యార్థినులకు అనేక అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు.

ఫలితంగా ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగారని చెప్పారు ఎక్కువ కూడా ఉండడం విశేషం అన్నారు. 29 ఏళ్లుగా ఎస్.వీ.ఎన్ స్కూల్ కు ప్రిన్సిపల్ కూడా మహిళ అని చెబుతూ ప్రిన్సిపాల్ మాధురి చేయూతతో అనేకమంది విద్యార్ధినులు పరిణతి పెంపొందిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము మొదటి నుంచి విద్యార్థినులలో వికాసం కలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని వివరించారు.

ఆకట్టుకున్న జెండర్ ఈక్వాలిటీ ప్రదర్శనలు

జెండర్ ఈక్వాలిటీ ఎంత అవసరమో తెలియజెప్పే స్కిట్లను స్టూడెంట్స్ తమ అద్భుత హావ భావాలతో ప్రదర్శించారు ఇంటి నుంచే వివక్ష మొదలవుతుందని తల్లిదండ్రులు అమ్మాయిని నిరుత్సాహపరిచే విధంగా వ్యవహరించడంతోపాటు అబ్బాయిలకు అద్భుత ప్రోత్సాహాన్ని ఇచ్చే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థినులను ప్రోత్సహించాలని వారిలోని ప్రతిభ పాటవాలను వెలుగులోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ స్కిట్లకు ఎస్.వీ.ఎన్ డైరెక్టర్ గొట్టిపర్తి వృతిక్ రూపకల్పన చేశారు. గత నాలుగు రోజులుగా వారికి శిక్షణ ఇస్తూ ప్రోత్సహించడంతో వారు ఎలాంటి భయం ఆందోళన లేకుండా చక్కగా ప్రదర్శించారు.

సరికొత్త విద్యా ప్రణాళికతో వండర్ కిడ్స్: వృతిక్

సరికొత్త విద్యా ప్రణాళికతో యాదగిరిగుట్ట పట్టణంలో వండర్ కిడ్స్ స్కూల్ ను ఎస్.వీ.ఎన్ ప్రారంభించిందని ఎస్.వీ.ఎన్ డైరెక్టర్ గొట్టిపర్తి వృతిక్ తెలిపారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు విద్యార్థులలోని క్రియేటివిటీని వెలుగులోకి తీసుకురావడానికి సరికొత్త విద్యా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తూ ఒక విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నదని చెప్పారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో నూతన భవనంలో సరికొత్త హంగులతో అధురాతన టెక్నాలజీకి మరింత శోభను చేకూర్చే విధంగా పాఠశాలను ప్రారంభించి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఆదరాభిమానాలతో 29 సంవత్సరాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను తీసుకొని సరికొత్తగా వండర్ కిడ్స్ స్కూల్ కు రూపకల్పన జరిగిందని చెప్పారు. తాము మొదటి నుంచి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అదే ఉద్దేశంతో బీసీ కాలనీ నుంచి జెండర్ ఈక్వాలిటీ కార్యక్రమాలను ప్రారంభించి విద్యార్థుల్లోనూ… తల్లిదండ్రుల్లోనూ ఆడపిల్లల పట్ల సరైన భావన కలిగించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ తల్లిదండ్రులు భాస్కర్, మాధురి లు ఇచ్చిన ప్రేరణ, స్ఫూర్తి వల్ల విదేశాలలో చదువుకున్నప్పటికీ ఈ ప్రాంతంలో విధ్యాఫలాలను అందరికీ అందించాలన్న తపనతో తాను సైతం పాఠశాల నిర్వహణలో భాగస్వామినీ అవుతున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, జయ భారత్ యూత్ అధ్యక్షులు దండ్ల బాల నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టు సతీష్ రాజ్ తోపాటు గుండు నరసింహ, యూత్ సభ్యులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.వండర్ కిడ్స్ స్కూల్లో అడ్మిషన్ల కోసం 8434242494 నంబర్లు సంప్రదించాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!