
నిజామాబాద్, రోమింగ్ న్యూస్:నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి*నిజామాబాద్, ఫిబ్రవరి 19: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పట్టభద్రుల ఓటర్లను స్వయంగా కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేయాలని మంత్రి కోరారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదు, డిపాజిట్ కూడా రాదనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని విమర్శించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీతో జత కట్టిందని అన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నా… బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని, ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. సుపరిపాలన చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్…. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని చెప్పారు.
55 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నదని వెల్లడించారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు