బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతల ఉదారత

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా నిర్వహించే గరుడ మరియు శేష వాహనాలను సుమారు 24 లక్షల రూపాయలు వెచ్చించి పలువురు దాతలు బంగారు తాపడంతో తయారు చేయించి ఆదివారం స్వామివారికి సమర్పించారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఏపూరి భాస్కరరావు దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లని తీగల లక్ష్మీ నరసింహ చార్యులు, ఉప ప్రధానార్చకులు వేదపండితుల సమక్షంలో వారు స్వామివారి సేవలకు బంగారు వాహనాలను ఉపయోగించాలని కోరుతూ సమర్పణ చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు సంప్రోక్షణ పూజలు నిర్వహించి స్వామి వారి ఖజానాకు స్వీకరించారు.

హైదరాబాదు కు చెందిన గార్లపాటి (సుభాష్) పెద్ద యాదయ్య, రామలింగేశ్వరి మరియు కుటుంబ సభ్యలుబంగారు తాపడం కావించి స్వామికి బహుకరించారు. ఇట్టి బంగారు వాహనములను బ్రహ్మోత్సవాల్లో అలంకార శేవలకు వినియోగించబడును మరియు హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి పావని constructions India Ltd దాత సుమారు 12 లక్షల వ్యయంతో గరుడవాహనాన్ని బంగారు తాపడం కావించి దేవస్థానానికి బహుకరించారు. అదేవిధంగా అనురాధ టింబర్ డిపో ,Hyd వారు నూతనంగా బర్మా టేక్ తో శ్రీ స్వామివారి సేవ పీఠాన్ని సుమారు నాలుగు లక్షల వ్యయంతో తయారు గావించి దేవస్థానానికి బహుకరించారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇట్టి నూతన సేవ పీఠపై బంగారు వాహనాలు అలంకారం గావించి ప్రప్రధమంగా బ్రహ్మోత్సవాల్లో ఊరేగిస్తారని ఈఓ భాస్కర్ రావు తెలిపారు.

