
భువనగిరి, రోమింగ్ న్యూస్:
భువనగిరి పట్టణ శివారులోని ఏకే ఫంక్షన్ హాల్ లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్ , మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ల ఆధ్వర్యంలో బూరకు వేద బ్రాహ్మణులచే ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాలను అందజేసారు. వేలాదిమంది బూర నర్సయ్య గౌడ్ అభిమానులు ఏకే ఫంక్షన్ హాల్ కు తరలివచ్చి బూరను శాలువాలు, బొకేలు పూలదండలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన మేధావి నిరాడంబరుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని ఈ సందర్భంగా చెప్పారు. భువనగిరి అభివృద్ధికి బూర నర్సయ్య గౌడ్ చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు.
