మూడో రోజుకు చేరుకున్న గుట్ట బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఈవో భాస్కర్ రావు

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం మూడోరోజు అలంకార సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అయిన సోమవారం శ్రీమహావిష్ణువు దాల్చిన మొట్టమొదటి అలంకారమైన మత్స్యావతారంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని అలంకరించి తిరువీధులలో భక్తులకు దర్శనం కల్పించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఇతర దేవస్థానం అధికారులు తిరువీధి సేవ ముందు నడుస్తుండగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, కాండూరు వెంకటాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు బట్టర్ సురేంద్ర చార్యులు ఆధ్వర్యంలోనీ అర్చక బృందం, వేద పండితులు, పారాయణికుల మంత్ర ఘోష లో శ్రీవారి తిరువీధి సేవ కొనసాగింది.

దేవస్థానము ఆస్థాన మండపంలో ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు మత్స్యవతార వైభవాన్ని భక్తులకు వివరించారు.
సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను ఆపరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్థం శ్రీమహావిష్ణువు మత్స్య అవతారం దాల్చి వేద పరిరక్షణ చేసిన వైనాన్ని వివరించారు. దుష్ట శిక్షణ… శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణ ఆయా కాలాలలో ఆయా అవసరాలను బట్టి అవతరించి తన కర్తవ్యాపాలను చేస్తాడని వివరించారు.
కొనసాగుతున్న అన్నదాన వితరణ
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నది దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు స్వయంగా వెళ్లి పర్యవేక్షణ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మూర్చ వల సందర్భంగా ఏర్పాటుచేసిన ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు వైభవంగా కొనసాగుతున్నాయి మొదటి రోజు నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పద్మశ్రీ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరుగుతోంది. వినయ్ కృష్ణ (Hyderabad)వారిచే కర్ణాటక సంగీతం నిర్వహించబడింది.

: శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి -2025 పురస్కరించుకొని నిర్వహించు ధార్మిక – సాహిత్య – సంగీత మహాసభలలో భాగంగా రోజున కుమారి సూరపనేని అనన్య (Hyderabad)వారిచే కూచిపూడి నృత్యం నిర్వహించబడింది.




