సందడిగా యాదాద్రి ఉత్సవాలు
రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖా కమిషనర్
అనిల్
యాదాద్రి, మార్చి 5 (రోమింగ్ న్యూస్):
సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం యాదాద్రిలో వైభవంగా నిర్వహించారు.. తనువు మనసు పులకించి పోతుండగా దేవదేవుని వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతా ఆహ్వానము బేరి పూజలను సాంప్రదాయ రీతిలో వేదమంత్రాలు ఘోష లో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం అర్చకులు నిర్వహించారు.
దర్పాల వంటి రోమాలు సమస్త దేవగణములను సేవించ బడుతుండగా పాదపీఠంమే పాతాలాంతరంగా, మధ్యప్రదేశము మర్త్యలోకంగా వర్ధిల్లుతుండగా పదకొండు రోజులపాటు జరగనున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతరలో శ్రీమన్నారాయణ వాహనమైన గరుత్మంతుని ఆహ్వానించి సకల దేవతలకు ఆహ్వానం గరుత్మంతుని ఆహ్వానించే పూజ జరిపారు. సకల దేవతలను యాదాద్రి నరసింహ స్వామి వారు ఆదివారం పెళ్లి కొడుకు అవుతున్నారని సబ్బండ బంధుగణం తో 33 కోట్ల దేవతలు తరలిరావాలని ఆహ్వానాన్ని పంపే కార్యాన్ని కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు.. ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహ చార్యులు బట్టర్ సురేంద్ర చార్యులు చింతపట్ల రంగాచార్యులు శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలోని వేదపండితులు బ్రహ్మోత్సవం కార్యాన్ని జరిపారు.. ధ్వజారోహణ వేళ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు అమ్మవారు పట్టుపీతాంబరాలతో పలురకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రవైఢూర్యాలు ధరించిన దేవేరులు ధ్వజస్తంభం వద్ద కొలువుదీరి వుండగా ధ్వజారోహణం ని జరిపారు. సమస్తము నేనే అన్నీ నేనే… అనే విధంగా ఆయన ఆజ్ఞానుసారము సృష్టి అంతా నడుస్తోందని భావించే తీరున గర్భాలయంలో నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి తిలకిస్తున్నారా అన్నట్లుగా గర్భాలయం వైపు ఎవరూ అడ్డు ఉండకుండా చేసి ఆయన సమక్షంలోనే ఉత్సవం మంగళ వాయిద్యాలు అర్చకులు వేద మంత్రాలు ఉపనిషత్తుల పారాయణాలు కోలాహలం నడుమ నిర్వహించారు.
ధ్వజం ఎదురుగా ప్రత్యేక పీఠంపై దేవేరులను అధిష్టించి….
శ్రీవారిని అమ్మవారిని బాల్యంలోని ధ్వజస్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్టింప చేశారు వారిద్దరి కనుసన్నలలో ధ్వజారోహణంతో నిర్వహించారు ధ్వజస్తంభానికి తెల్లని వస్త్రం పై గరుత్మంతుని చిత్రపటం కుంకుమతో వేసి ఆ వస్త్రానికి షోడశోపచారాలు చేశారు. ధ్వజస్తంభానికి దర్భలతో తయారుచేసిన తాడుతో గరుత్మంతుని చిత్రపటం వస్త్రాన్ని కట్టారు. ధూప దీప నైవేద్యాలు చేసి గరుడ ముద్దులను ఎగురవేశారు. గరుడ ముద్దను అందుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. మానసిక, గర్భ సంబంధ, దీర్ఘ రోగాలతో బాధపడుతున్నవారు గరుడ ముద్దలను తింటే సంతాన సౌభాగ్యాలు కలగడంతో పాటు దీర్ఘకాల రోగాలన్నీ మాయమవుతాయని భక్తుల నమ్మకం.. ధ్వజారోహణం కన్నులారా గాంచిన వారికి భగవంతుని అనుగ్రహం కాలసర్ప నాగ దోష మొదలైన అపమృత్యు దోషాలు తొలగిపోతాయని గరుడ పురాణం పేర్కొన్న అంశాన్ని కాండూరి వెంకటాచార్యులు వివరించారు.. అనేక శుభ పరంపరలకు దోహదపడే పర్వంగా ధ్వజారోహణం ని ఉదహరిస్తారు.. ఆలయ అర్చకులు రాగ తాళ యుక్తంగా వేదమంత్రాలు పాటిస్తారు గరుడుని ఆహ్వానించే ఈ సందర్భంగా పాడిన పాటలు వేదోక్త మైనదిగా భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.
ధ్వజారోహణం విశిష్టత ఉత్సవ ప్రారంభ సూచకంగా
శ్రీవారి ఆలయంలో నిర్వహించబడును సర్వవిధ కైంకర్యాలకు భగవంతుని అనుగ్రహం ఉంటుందని సకల దేవ కోటిని విచేయమని వేడుకొనే ప్రార్థన ఇది. ఉత్సవాలలో ధ్వజారోహణంకు ఎంతో విశిష్టత ఉంది. భగవానుని దివ్య దేహమే వేద మయమని ఆ వేద స్వరూపుడు గరుత్మంతుడు అని గరుత్మంతుని ఆహ్వానించడం ద్వారా సకల దేవ కోటిని ఉత్సవ తంతులో భాగ స్వామ్యం తీసుకోమని గరుత్మంతుని వేడుకున్నారు. గరుత్మంతుని వైభవం గురించి కొనియాడుతూ బంగారు కాంతులతో ధ్వజస్తంభాన్ని చతుర్భుజాలతో నాలుగు నాసికతో 8 చెవులతో పెద్ద కంఠం విశాల హృదయము కలిగి సు ప్రసన్న ముఖంతో తీక్షణమైన కోరలతో రాక్షసులను సంహరించిన స్వరూపం కలిగిన వాడు… మంత్రపూర్వకంగా నిర్వహించే ఘట్టమే ధ్వజారోహణం. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ అమ్మవారు శ్రీ లక్ష్మీ నరసింహ ధ్వజస్తంభం వద్ద స్వయంగా వేంచేపు చేసి ఉండగా గరుత్మంతుని ఆహ్వానం కోసం జరిగేతంతూ అర్చకులు ఆసక్తికరంగా నిర్వహించారు.
ఆలయంలో హవనం బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా అగ్ని ప్రతిష్ట చేసి ఆ అగ్నిలో పంచపల్లవాలు రాగి మేడి జువ్వి మోదుగు మామిడి చెట్ల కర్రలతో హోమాన్ని వెలిగించారు. అందులో నారాయణ లక్ష్మీ, సుదర్శన, నరసింహ, ఆంజనేయ, గరుడ మొదలైన మూల మంత్రాలతో భవనం జరిపారు.
దేవత ఆహ్వానం
సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశ అయినా శ్రీ లక్ష్మీ నరసింహ గుడి బ్రహ్మోత్సవాలకు 33 కోట్ల దేవతలు ఆహ్వానించే ప్రక్రియ అయినా దేవత దేవతలను ఆహ్వానం చేసే ప్రక్రియను శనివారం రాత్రి అర్చకులు ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు అంతకుముందు భేరి పూజ జరిపారు. సకల దేవతలను భేరీ నాదాలు… మంగళ వాయిద్యాలు రాగ తాళ యుక్తంగా ఆవాహనం చేసి గర్భాలయంలోని ప్రధాన కలశంలో అధిష్టింప చేశారు. లోకకల్యాణార్థం చేసే బ్రహ్మోత్సవాలకు అవరోధాలు కలగకుండా చూడటానికి దేవతలను దివి నుంచి భువికి అదృశ్యరూపంలో రప్పించే ప్రక్రియను దేవత ఆహ్వానం గా పిలుస్తారు. ఆలయ అర్చకులు సకల మూల మంత్రాలతో హావనం జరిపారు.
భేరీ పూజ అనగా…
భేరి అనగా బ్రహ్మోత్సవ వేళల్లో సమస్త దేవతలకు వారికి ఇష్టమైన రాగ తాళాలతో వేరే నినాదాలు. సమస్త దేవతలను ఆహ్వానించే ప్రక్రియను జరిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా కమిషనర్ అనిల్ కుమార్, దేవాలయం ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నారసింహ మూర్తి, ఏ ఈ ఓ లు గజ్వేల్లి రమేష్ బాబు, దోర్భల భాస్కర్, పర్యవేక్షకులు వేముల వెంకటేష్,శర్మ, రాకేష్ రెడ్డి, ఈ ఈ దయాకర్ రెడ్డి, డీ ఈ మహిపాల్ రెడ్డి,అసిస్టెంట్ స్థపతి నర్సింగ్ రావు, డీఈ ఉడెపు వెంకట రామారావు, ఈఓ సీసీ అశ్విని తదితరులు పాల్గొన్నారు.