మంత్రి వర్గంలో మార్పు.! ఉగాది తర్వాత క్యాబినెట్ కూర్పు.! ఐదు కొత్త ముఖాలకు కేసీఆర్ అవకాశం.!

తెలంగాణ క్యాబినెట్ పునర్వవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే క్యాబినెట్ లో కొత్తవారికి చోటు కల్పించాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది. శాసన సభ సమావేశాలు, యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తైనందు వల్ల ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలోనో లేదా రెండో వారంలోనో తెలంగాణ మంత్రవర్గంలో మార్పులకు సీఎం చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో ఐదుగురు కొత్త అభ్యర్ధులకు మంత్రులుగా అవకాశం కల్పించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
క్యాబొనెట్ అనేక కారణాలవల్ల వాయిదా..
ఉగాది తర్వాత ముహూర్తం ఫిక్స్
సీఎం చంద్రశేఖర్ రావు ఏదీ చెప్పి చేయరు. ముహూర్తం ప్రకారం కూడా పెద్దగా అడుగులు వేయరు. ఎవరైనా చెప్పారనో,ఒత్తిడి తెచ్చారనో ఆ పని చేయరు. తనకు వీలైనప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తెలంగాణ మంత్రివర్గ పునర్వవస్థీకరణ కూడా అదే విధంగా జరగబోతోంది. తెలంగాణ క్యాబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నపటికి అనేక కారణాలవల్ల వాయిదా పడుతూవస్తోంది. ఆశావహులు మాత్రం తెలంగాణ భవన్, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు. మరికొంత మంది ఎర్రవల్లి ఫాంహౌస్ కు సైతం రూట్ మార్చినట్టు తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలు మారకుండా.. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా క్యాబినెట్ కూర్పు
తెలంగాణ క్యాబినెట్ విస్థరణకు సీఎం చంద్రశేఖర్ రావు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉగాది తర్వాత కుదిరితే ఏప్రిల్ మొదటి వారంలో కుదరక పోతే ఏప్రిల్ రెండో వారంలో క్యాబినెట్ కూర్పును చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసనపలికే అవకావం ఉందిని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొంత మంది మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని, ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్ధాయిలో ప్రజలకు వివరంచడంలో విఫలం చెందుతున్నారని సీఎం చంద్రశేఖర్ రావు హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఐనప్పటికీ సీఎం హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది.
ఈ సారి మహిళలకు ప్రాధాన్యత..
కల్వకుంట్ల కవితకు మంత్రిగా ఛాన్స్..


ఉత్వర తెలంగాణ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలకు, దక్షిణ తెలంగాణ నుండి ఇద్దరు ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నగరానికి సంబందించిన ఓ మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్వాసన పలికే మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను తిరిగి మంత్రులుగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా ప్రతి వర్గానికి గుర్తింపునిచ్చే విధంగా మంత్రి వర్గ కూర్పు చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రి వర్గ కూర్పులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.