ఎంజీఎంలోని ఆర్ఎస్ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.కొద్ది రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం ఎంజీఎంలో చేర్చారు. అతడిని ఆర్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎంలో బుధవాం రాత్రి రోగి శ్రీనివాస్ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టు కట్టారు. గురువారం ఉదయానికి ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడిమ వద్ద ఎలుకలు కొరికడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు.