భువనగిరి, మార్చి 31 (రోమింగ్ న్యూస్):
పార్లమెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (SAGY) కార్యక్రమంలో భాగంగా వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. వీటిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సుకన్య సమృద్ధి యోజన ( బేటీ బచావో బేటి పడావో ) క్రింద అర్హులైన 118 మంది లబ్ధిదారులను గుర్తించి వారందరికీ నూటికి నూరు శాతం ఖాతాలను తెరిపించినందుకు గాను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు వడపర్తి గ్రామాన్ని నూటికి నూరు శాతం ఖాతాలు పూర్తి చేసిన గ్రామంగా ప్రకటించారు. ఈ విధంగా పూర్తి చేసిన తొలి గ్రామంగా వడపర్తి గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుందని అన్నారు.
అదేవిధంగా దేశం మొత్తంలో 345 గ్రామలలో (SAGY క్రింద ఎంపిక చేయబడిన గ్రామాలలో) వడపర్తి గ్రామం 5వ స్థానంలో ఉండడానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ పాలక వర్గం, MPTC, పంచాయతి కార్యదర్శి, అంగన్ వాడీ టీచర్, ఆశ, వి.ఎ.ఓ. లను జిల్లా కలెక్టర్ సన్మానించి సర్టిఫికెట్స్ ప్రదానం చేసి అభినందించారు. అనంతరం గ్రామంలో నిర్వహించబడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పంచాయలు రాజ్, ఆర్.డబ్ల్యూ. ఎస్. ఎలక్ట్రిసిటీ అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణమే పనులు పూర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. తదుపరి గ్రామ పంచాయతీ నర్సరీ,
అంగన్ వాడీ పాఠశాలను సందర్శించడం జరిగింది.
కార్యక్రమంలో జడ్.పి.టి.సి. బీరు మల్లయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, అడిషనల్ డి.ఆర్.డీ.ఓ. నాగిరెడ్డి , MPDO, MPTC శారద, గ్రామ పంచాయితీ పాలకవర్గ సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు