ఎండలో మీడియా సమావేశం పట్ల స్వరూపనందేంద్రస్వామి ఆగ్రహం
యాదాద్రి దేవస్థానంలో మీడియాకు జరుగుతున్న అవమానాలపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతా
యాదాద్రి, ఏప్రిల్ 12 (రోమింగ్ న్యూస్)
ప్రెస్ కు ఇచ్చే మర్యాద ఇది కాదు… ఇక్కడ ఎండలో ఇలా నిలబెట్టి అతిథులతో మీడియాను మాట్లాడించే పరిస్థితి మారాలి… యాదాద్రి క్షేత్ర వైభవం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో మీడియాకు గౌరవం ఉండాలి మీడియా యొక్క సహకారం తీసుకోవాలి యాదాద్రి దేవస్థానం అధికారులు ఈ విషయంలో చొరవ చూపాలని విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు అన్నారు.మంగళవారం ఆలయ ఘటన తర్వాత మొట్ట మొదటి పీఠాధిపతి హోదాలో ఆయన
మంగళవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ కొండకింద శ్రీలక్ష్మీ నరసింహ సధనం మెట్ల వద్ద ఒక టేబుల్ ఏర్పాటు చేసి మీడియా సమావేశం జరిపారు. సమావేశం ముగిసిన మీదట ఈ సందర్భంగా టీయూడబ్లుజే జిల్లా అధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ స్వామీజీకి యాదాద్రి జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టికి తీసుకుపోయారు. మీడియాను కొండపైకి అనుమతించడం లేదని ఇలా కొండ కింద ఎండలో నిలబడి మీలాంటి వారి ఇంటర్వ్యూలు చేయాల్సి వస్తోందని చెప్పగా ఆయన తీవ్రంగా స్పందించారు.ఇంతటి ఎండలో ఇలాగ నిలబడి సమావేశం పెట్టడం బాధగా ఉంది… ఇంతటి దారుణ పరిస్థితి ఉంటుందని అనుకోలేదు.మీడియాకు మంచి గౌరవం ఇవ్వాలి మీడియా వల్లనే ప్రచారం జరుగుతుంది…గదుల విచారణ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సరైంది కాదు.. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. యాదాద్రి అభివృద్ధిని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని అదే స్థాయిలో ప్రచారం కూడా అవసరమని చెప్పారు. మీడియా ఉంటేనే ప్రచారం జరుగుతుందని అన్నారు. దేవస్థానం అధికారులు, కమిటీ వారు ఇది ఆలోచించాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఎండలో నిలబడి ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్టుల కు ధన్యవాదాలు తెలియజేశారు.ఆశీస్సులు కూడా ఇచ్చారు.