పెద్దపల్లి జిల్లా కేంద్రములొని మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువశాతం చెట్లను పెంచాలని పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమం మాదిరిగానే, మొక్కలను మరింత పెంచాలని ఉద్దేశంతో ఎంపీ జె సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటలని పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ని నామినేట్ చేయగా దీంతో స్పందించిన అఖిల్ మహాజన్ పెద్దపల్లి డీసీపీ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటి వాటి
తో సెల్ఫీ దిగారు. అనంతరం మరో ముగ్గురికి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైభవ్ గైక్వాడ్ అడిషన్ డీసీపీ వరంగల్, గౌష్ ఆలం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ములుగు మరియు భూపాలపల్లి, కిరణ్ కారే
ఎస్ డి పి ఓ బైంసా లను లను చాలెంజ్ కు నామినేట్ చేస్తున్నట్లు ఇంచార్జ్ డీసీపీ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.