RN DAILY     G9 TELUGU TV    ePaper

యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ. కే. శివశంకర్ గౌడ్

యాదగిరిగుట్ట, జనవరి 21 (రోమింగ్ న్యూస్)
ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో – తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యమని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ కే. శివశంకర్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గుట్ట చౌరస్తాలో శనివారం ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

యాదగిరిగుట్టలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ శివశంకర్ గౌడ్

ఈ సందర్భంగా ఆయన శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి మనిషికి పేరు ఎంత ముఖ్యమో అలాగే వాహనానికి నెంబర్ ప్లేట్ కూడా అంతే ముఖ్యన్నారు. వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు పెరుగుతున్నాయి అంటే, మనం ప్రమాదానికి దగ్గరవుతున్నామని అర్థం చేసుకోవాలన్నారు.రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ ఆదేశాల మేరకు అలాగే రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మార్గనిర్దేశంలో యాదాద్రి భువనగిరి ట్రాఫిక్ ఏసిపి సైదులు పర్యవేక్షణలో ప్రతి రోజు నెంబర్ ప్లేట్ లేని, అక్రమ నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

యాదగిరిగుట్టలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు.

ఈ కార్యక్రమంలో భాగంగానే యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ.కే. శివశంకర్ ఆధ్వర్యంలో అదనపు ఇన్స్పెక్టర్ యాదగిరి, ఎస్సైలు మహేష్, శ్రీనివాస్, శివకుమార్ మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బందితో కలిసి నెంబర్ ప్లేట్ లేని అలాగే అక్రమమైన నెంబర్ ప్లేట్ కలిగిన, నెంబర్లు చేరిపివేసిన వాహనాలను జప్తు చేశారు. వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై మళ్లీ చలనా విధించి, మొత్తం పాత చలాన్లను కలిపి కట్టించడమే కాక, సరైన రీతిలో తగిన నెంబర్ ప్లేట్లు వేయించిన తర్వాత వాహనాలను రిలీజ్ చేయడం జరుగుతుందని సిఐ శివ శంకర్ తెలిపారు. యాదాద్రి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలావరకు నేరస్తులు నేరం చేసే క్రమంలో వారు తిరిగే వాహనాలకు నెంబర్ ప్లేట్ తీసేసి తిరుగుతూ ఉంటారు. కావున అలాంటి నేరస్తులకు అవకాశం ఇవ్వకూడదని, నేరాలను నియంత్రించడంలో భాగంగా కమిషనర్ ఈ స్పెషల్ డ్రైవ్ రెగ్యులర్ గా చేయాలని ఆదేశించారన్నారు.
ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ని విధిగా పాటించడం వల్ల ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చునీ, అలాగే అనవసరంగా తమ వాహనాలపై చాలాన్లు పడకుండా చూసుకోవచ్చని సూచించారు.

ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో, చట్టాలను అతిక్రమిస్తారో వారు మాత్రమే నేరస్తుల వలె ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ పై నెంబర్లు చేరిపివేయడం, నెంబర్ ప్లేట్లు వంచడము చేస్తూ ఉంటారన్నారు. అలాంటి వారికి విజ్ఞప్తి చేసేదేమిటంటే దయచేసి మీ వాహనం యొక్క డాక్యుమెంట్లను కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలన్నారు. మొబైల్ డ్రైవింగ్ చేయకుండా.. ఆపోజిట్ డ్రైవింగ్ చేయకుండా, మద్యం సేవించి వాహనం నడపకుండా, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకుండా, అతివేగంగా నడపకుండా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా వాహనాన్ని నడిపినట్లు అయితే మీకే కాక రోడ్డుపై వెళ్లే వారికి అందరికీ సురక్షితంగా ఉంటుందన్నారు. నిబంధనలు పాటించిన వారు ఎవరికి భయపడాల్సిన పనిలేదన్నారు. అలాంటప్పుడు ఎలాంటి చలానలు కూడా విధించడం జరగదని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులకు సహకరించి రోడ్డు ప్రమాదాల నుండి రక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!