RN DAILY     G9 TELUGU TV    ePaper

జయహో జక్కన్న…జయహో టాలీవుడ్
తెలుగు సినీ జగత్తుకు సువర్ణాధ్యాయం:చిరు

అవును ఆస్కార్ కల సాకారమైంది….భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ సాధించని అరుదైన ఆస్కార్ అవార్డును అర్.అర్.అర్. నాటు… నాటు పాట ఒరిజినల్ సాంగ్స్ విభాగంలో గెల్చుకుంది.


తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పాట రాసిన చంద్రబోస్….దానికి రాగాలు కూర్చిన కీరవాణి లాస్ ఏంజిల్స్ లో అవార్డు అందుకుంటున్న దృశ్యాలు కోట్ల మంది భారతీయుల్లో ఆనంద భాష్పాలు రాల్చెలా చేసింది. ఎర్ర జొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపితింటే వచ్చే ఆనందాన్ని ఆస్కార్ అవార్డు మిగిల్చింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అర్.అర్.అర్ సినీమా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సరికొత్త వైభవాన్ని తీసుకొచ్చింది. భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ తీసుకురావడం పట్ల భారతీయుల్లో

ఆనందం వ్యక్తం అవుతుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం… సువర్ణాక్షరాలతో లిఖించదగిన …విషయం ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు 2023 ఆర్ఆర్ఆర్ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్
సాంగ్

కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీపడిన అప్లాజ్… లిఫ్ట్ మీ అప్… మొదలైన పాటలను వెనక్కి నెట్టి నాటు నాటు ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు ఆస్కార్ గెలుచుకున్నట్లు ప్రకటించగానే డాల్బీ థియేటర్ లోని ఆర్ ఆర్ అర్ అభిమానులు ఆనందంతో చిందులు వేసారు. చప్పట్లతో థియేటర్ దద్దరిల్లింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ అర్ బృందం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనలతో డాల్బీ థియేటర్ హోరెత్తింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన పిరియాడిక్ యాక్షన్ మూవీ ఆర్ ఆర్ గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది. 1000 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేస్తుంది. ఈ సినిమాపై హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరున్, స్పిల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. మూవీ వివిధ కేటగిరీలో ఆస్కార్ అవార్డులకు పోటీ పడగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు కు ఆస్కార్ నామినేషన్స్ తృది జాబితాలో చోటు దక్కించుకుంది. స్వరమని కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ, రాహుల్ సిప్లిగం ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట విడుదలైన నాటి నుంచే అశేష ప్రేక్షాదరణ సొంతం చేసుకొని ఇప్పుడు ఏకంగా ప్రపంచమంతా నాటు నాటు అని మురిసిపోయేలా చేసింది.

ఆనందోత్సవంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ

ఆర్ ఆర్ అర్ ఆస్కార్ సాధించడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆనంద ఉత్సవంలో మునిగిపోయింది. టాలీవుడ్ దిగ్గజం చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో ఇది సువర్ణ అధ్యయమని అభివర్ణించారు. మురళీమోహన్ ఇది మహాదేవుని ఆశీస్సులుగా జక్కన్న సాధించిన విజయంగా అభిమానించారు. మొత్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఆనందంతో మురిసిపోతున్న క్షణాలు ఇవీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!