నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్
విద్యార్థులకు సామూహిక అన్న ప్రసాద వితరణ
ఆకట్టుకున్న విద్యార్థినుల పాటలు
యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:
ఎస్.వీ.ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ లో మంగళవారం శ్రీ
ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులంతా క్రమశిక్షణతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో పాఠశాల ఆవరణలో ఎంతో సందడిగా చేశారు. పూజా కార్యక్రమాలు ముగిశాక విద్యార్థులందరికీ పాఠశాలలో తీర్ధ ప్రసాదం మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి లు విద్యార్థులకు స్వయంగా వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సత్యదేవుని కీర్తిస్తూ విద్యార్థులు ఆలపించిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థులకు సకల శుభాలు కలగాలని…
విద్యార్థులకు సకల శుభాలు కలగాలని విద్యార్థులలో పోటీ తత్వం పెంపొందాలని కోరుతూ ఎస్.వీ.ఎన్ లో సత్యదేవుని వ్రతం ఆచరించినట్లు వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ మాధురిలు తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరమనే ఉద్దేశంతో పాఠశాలను డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.