గత 20 ఏళ్ళుగా ఎస్.వీ.ఎన్ లో ఎస్.ఎస్.సీ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత
నేటి ఎస్.ఎస్.సీ ఫలితాల్లో 100% రిజల్ట్ సాధించిన ఎస్.వీ.ఎన్
పాఠశాల ఆవరణలో విజయోత్సవం జరుపుకున్న విద్యార్థులు…ఉపాధ్యాయులు
విద్యార్థులకు స్వీట్లు… జ్ఞాపికలు అందజేసి ప్రశంసించిన యాజమాన్యం
ఇది ఉపాధ్యాయుల, విద్యార్థుల విజయం కరస్పాండెంట్: గొట్టిపర్తి భాస్కర్ గౌడ్
అత్యున్నత బోధనతో 100% ఫలితాలు: ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి
యాదగిరిగుట్ట, మే 10 (రోమింగ్ న్యూస్):
యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ విద్యార్థులు ఎస్.ఎస్.సీ 2023 పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మంది 10 జీ.పీ.ఏ సాధించడంతో పాటు గత ఇరవై ఏళ్లుగా 100 శాతం ఫలితాలు సాధిస్తూ ప్రభంజనం సృష్టిస్తున్నారు.
ఎస్.వీ.ఎన్ నుంచి ఎస్.ఎస్.సీ లో పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ అన్నారు. బుధవారం ఎస్.ఎస్.సీ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత పాఠశాల ఆవరణలో జరిగిన విద్యార్థుల సక్సెస్ మీట్ లో ఆయన ప్రసంగించారు. ఉన్నత ఫలితాలు సాధించడం వల్ల పాఠశాల గౌరవం మరింత పెరిగిందని చెప్పారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం లో ఉపాధ్యాయులు 100% కృతకృత్యులు అయ్యారని ప్రశంసించారు. విద్యార్థుల్లో చదవాలన్న కాంక్షను పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అమలు చేశారని చెప్పారు.ఎస్.వీ.ఎన్ లో పరీక్ష రాస్తే ఖచ్చితంగా అత్యధిక మార్కులు సాధించాలనే తత్వాన్ని పెంపొందించి వారి విజయానికి కారణంగా ఉపాధ్యాయులు నిలిచారని చెప్పారు. ఎస్.వీ.ఎన్ లో విద్యార్జన చేయడం వల్ల సాధారణ విద్యార్థి ఇది కూడా అసాధారణ ఫలితాలతో తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటున్నారని చెప్పారు.
విద్యార్థులు కమిట్మెంట్తో ఏదైనా సాధించాలన్నా మనస్తత్వాన్ని పెంపొందించడానికి కోసం కృషి జరుగుతుందన్నారు. పోటీ ప్రపంచంలో ఎస్.వీ.ఎన్ విద్యార్థులు విజేతలుగా నిలబడడం ఆనందంగా ఉందని చెప్పారు. విద్యార్థి పై నిరంతర పర్యవేక్షణ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మానసిక ఉల్లాసం కలిగించేందుకు కో కరిక్యులర్ ఆక్టివిటీస్ ఎంతో దోహద పడ్డాయన్నారు. అదేవిధంగా విద్యార్థులకు డిజిటల్ స్మార్ట్ క్లాసెస్ ఉండడంవల్ల అనుమానం ఉన్న అంశాలపై మరీ మరీ వాటిని శోధించి సాధించడం వల్ల విద్యార్థుల లో క్వాలిటీ పెరిగిందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటుచేసిన లైబ్రరీ వల్ల చరిత్ర, భూగోళంతో పాటు లాంగ్వేజెస్ పైన కూడా పట్టు ఏర్పడటానికి దోహదపడిందన్నారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ యొక్క అవసరాన్ని గుర్తించి అన్ని హంగులతో అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని, విద్యార్థులు దాన్ని సద్వినియోగ పరచుకున్నారని చెప్పారు. అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా అత్యున్నత ఫలితాలు సాధించారని చెప్పారు. ప్రభుత్వం లంబాడా, ఎరుకల తదితర గిరిజన విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కీంను యాదాద్రి జిల్లాలో ఎస్.వీ.ఎన్ హైస్కూల్లో అమలు చేస్తుందని దాని వల్ల విద్యార్థులకు చదువుకునే అవకాశం కలిగిందని వివరించారు.
అత్యున్నత బోధన తో 100% ఫలితాలు: ప్రిన్సిపల్ మాధురి
విద్యార్థులకు అత్యున్న ప్రమాణాలతో కూడిన బోధనను చేయడంవల్ల వరుసగా ఇరవై ఏళ్ల నుంచి 100 శాతం ఫలితాలు సాధిస్తున్నామని ఎస్.వీ.ఎన్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి చెప్పారు. యాదగిరిగుట్టలో ఎస్ వి ఎన్ విశ్వవిజేతగా నిలబడిందని ప్రశంసించారు. తల్లిదండ్రుల సహకారం వల్ల అదనపు తరగతులు నిర్వహించుకోవడానికి అవకాశం ఏర్పడిందని వాటివల్ల ఎంతో మేలు కలిగిందని చెప్పారు. ఎక్కువమంది విద్యార్థులు 10 జీ.పీ.ఏ సాధించడానికి తాము అవలంబించిన వినూత్న ప్రణాళికలు కారణమని చెప్పారు.
స్కూల్ టాపర్ గా నిలిచిన సీస రుతిక మాట్లాడుతూ తాను మొదటి నుంచీ ఎస్.వీ.ఎన్ లోనే విద్యను అభ్యసించానని దానివల్లనే అనేక సబ్జెక్టుల్లో 10 జీ.పీ.ఏ సాధించే అవకాశం కలిగిందని చెప్పారు. అదేవిధంగా స్కూల్ లో రెండో ర్యాంకు సాధించిన సోగతుటూరు మనస్విని మాట్లాడుతూ హాస్టల్లో తమను సొంత పిల్లల మాదిరిగా చూసుకొని విద్యా బోధన చేయించిన మాధురి మేడం, భాస్కర్ సార్ లను మరిచిపోలేనని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండీ యూసుఫ్, రాజేంద్ర ప్రసాద్, హరీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
స్వీట్లు పంపిణీ చేసిన యాజమాన్యం
విద్యార్థులు 100% ఫలితాలు సాధించి యాదగిరిగుట్ట పట్టణంలో అపూర్వ విజయాన్ని అందించినందుకు 2023 లో పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వారిని అభినందించారు. అదేవిధంగా ర్యాంకులు సాధించిన రుతీక, మనస్విని లకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించి తమ ప్రస్థానాన్ని విజయతీరాలకు చేరుకోవాలని, ఇంటర్మీడియట్ ఆ తర్వాత విద్యలను కూడా అభ్యసించాలని పాఠశాల యాజమాన్యం వారికి సూచించింది.