యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:
గిరిజన సంక్షేమ పథకం కింద బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫీజు రీఅంబర్స్మెంట్ కింద 25 మంది ఎస్.టి. విద్యార్థులకు యాదగిరిగుట్టలోని శ్రీవిద్యానికేతన్ రెసిడెన్షియల్ హైస్కూల్ లో లాటరీ పద్ధతిలో ప్రవేశం కల్పించడం జరిగిందని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.
సోమవారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది.
మూడవ తరగతిలో 13 సీట్లు, ఐదవ తరగతిలో 6 సీట్లు 8వ తరగతిలో 6 సీట్లు మొత్తం 25 సీట్ల కోసం లాటరీ నిర్వహించబడింది. ఇందుకోసం మొత్తం 30 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ పథకం కింద పదవ తరగతి వరకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యంతో పాటు హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుంది.
ఈ పథకం కింద ఇప్పటికే 76 మంది గిరిజన విద్యార్థులు ఇదే స్కీమ్ కింద విద్యాభ్యాసం చేస్తున్నారని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి నాగిరెడ్డి, సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.