8న జరిగే గోపా జనరల్ వాడికి రావాలని ఆహ్వానం
పనిచేసేవారు పదవులు తీసుకోవాలని సూచించిన పలువురు గోపా పూర్వాధ్యక్షులు
హైదరాబాద్, రోమింగ్ న్యూస్: పనిచేసే వారికి గోపా స్టేట్ బాడీలో పదవులు దక్కాలి… గోపాను మరింత బలోపేతం చేయాలి… గ్రామాలకు కూడా విస్తరించాలి… బడుగు బలహీన వర్గాల పిల్లలను ఆదుకోవాలి ఇదే కర్తవ్యంగా కొత్త కార్యవర్గం ఏర్పడాలని గోపా పూర్వాధ్యక్షులుగా పనిచేసిన పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
గోపా రాష్ట్ర జనరల్ బాడీ ఈనెల 8న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో గోపాకు విశిష్ట సేవలు అందించిన పూర్వ అధ్యక్షులను ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి బండి సాయన్న గౌడ్ ల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం వారిని కలిసి జనరల్ బాడీకి రావాలని విజ్ఞప్తి చేయడంతో పాటు గోపాకు మంచి కార్యవర్గాన్ని ఎన్నుకునే విషయంలో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేయగా వారు పై విధంగా స్పందించారు.
ఖచ్చితంగా మంచి వ్యక్తులు కార్యవర్గంలోకి రావాలి… పదవులు రాగానే బాధ్యతగా తీసుకొని పనిచేయడం వారి నైజంగా ఉండాలి… అప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు గోపా విస్తరిస్తుందని పూర్వ అధ్యక్షులు పలువురు అభిప్రాయపడ్డారు.
గోపా మాజీ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అలంపూర్ సాయిబాబా గౌడ్, సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ ఈడ శేషగిరిరావు గౌడ్, డాక్టర్ బోల్గం విజయ్ భాస్కర్ గౌడ్, పూదరి వెంకటరాజం గౌడ్ లు పై విధంగా ఆశాభావం వ్యక్తంచేశారు. గోపా కార్యవర్గం గౌడ కులానికి పెద్దన్న పాత్రను పోషించే స్థాయికి చేరుకున్నదని దీని స్థాయి… వైభవం మరింత బలోపేతం అయే విధంగాకొత్తగా ఏర్పడే కార్యవర్గం పనిచేయాలని వారు హితవు పలికారు.
గోపా జనరల్ బాడీ మీటింగ్, ఎలక్షన్ లో గౌరవ ముఖ్య సలహాదారులుగా హాజరు కావాలని కోరుతూ మమ్మల్ని ఆహ్వనించడం శుభ పరిణామమని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి మొగిలి రాఘనాద్ గౌడ్, ఉపాధ్యక్షులు ముద్దగోని రాంమోహన్ గౌడ్, జీ. వి శ్రీనివాస్ గౌడ్, కారింగు బిక్షమయ్య గౌడ్, కార్యనిర్వహక కార్యదర్శి చీకూరి సత్యం గౌడ్, సంయుక్త కార్యదర్శి యల్మకంటి మీరయ్య గౌడ్ లు పాల్గొన్నారు.