కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. TPCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. రెండు వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షులుగా అనుముల రేవంత్ రెడ్డి పక్క ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో క్రియాశీల పాత్ర పోషించడం పట్ల ఏఐసిసి అభినందనలు తెలిపింది. అదేవిధంగా కొత్తగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేసింది.