
యాదగిరిగుట్ట, సెప్టెంబరు 6 ( రోమింగ్ న్యూస్):యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం గుండ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ జి. స్వర్ణలత ఆధ్వర్యంలో విద్యార్థులను పరీక్షించి వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేశారు.

సీజనల్ వ్యాధుల నివారణ కోసం పాఠశాలలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ జి స్వర్ణలత చెప్పారు. వర్షాకాలంలో వచ్చే రోగాలను అరికట్టడమే పరమార్ధంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు.

సాధారణంగా జలుబు, జ్వరము, దగ్గు సంబంధిత వ్యాధులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్టు తేలిందని చెప్పారు. సుమారు 100 మంది విద్యార్థులకు కావలసిన మందులు టానిక్ లను అందజేశారు.

ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చాలామంది జలుబు, జ్వరము, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నందున విద్యార్థులకు కావలసిన వైద్య సలహాలను తీసుకోవడానికి డాక్టర్ స్వర్ణలతను సంప్రదించామని చెప్పారు.

పాఠశాల యాజమాన్యం నిధులతో మందులను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేశామన్నారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఎస్వీఎన్ ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల కోసం హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహిస్తున్నమని చెప్పారు. పలు రకాలతో బాధపడుతున్న రెగ్యులర్ స్కాలర్స్ కోసం కూడా డాక్టర్ స్వర్ణలత పరీక్షించి టాబ్లెట్లు టానిక్ లు రాసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఎన్ ప్రిన్సిపల్ గొట్టిపర్తి మాధురి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది డి. రేఖ తదితరులు పాల్గొన్నారు.
