బండి సాయన్న గౌడ్ నేతృత్వంలో గోపా అద్భుతంగా పనిచేస్తుందన్న నమ్మకం ఉందన్న మంత్రి పొన్నం
పదవులు అలంకారప్రాయం కారాదన్న మంత్రి పొన్నం
ఆల్ ద బెస్ట్ చెప్పిన
విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం
గోపాకు అండగా ఉంటా: నూతి శ్రీకాంత్ గౌడ్
కంగ్రాట్యులేషన్స్ అంటూ గోపాకు అండగా ఉంటానన్న నేరెళ్ల శారద
గౌడ హాస్టల్ అధ్యక్షులు మోతే చక్రవర్తి గౌడ్ ను కలిసిన
పీఎస్టి లు
పూర్వాధ్యక్షులు ఈడ శేషగిరిరావు, బోల్గం విజయభాస్కర్ లను కలిసిన గోపా బృందం
హైదరాబాద్, రోమింగ్ న్యూస్:
గోపా బండి సాయన్న గౌడ్ నేతృత్వంలో అద్భుతంగా ముందుకు సాగుతుందనే నమ్మకం ఉంది… కొత్త కార్యక్రమాలు తీసుకొని సరికొత్తగా గోపాను తీర్చిదిద్దండి…నవశకానికి నాంది పలకండి అంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నూతనంగా ఏర్పడిన గోపా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు… వాటికి వన్నె తేవాలి.. ఆ శైలిలో మీరు ముందుకు సాగాలంటూ ఆయన ఆకాంక్షించారు. గౌడ్ ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన బండి సాయన్న గౌడ్ నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి జి.వి. శ్రీనివాసగౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్ ఆధ్వర్యంలోని గోపా బృందం హైదరాబాదులో మంత్రిని కలిసి కొత్త కార్యవర్గం వివరాలను తెలియజేశారు. స్పందించిన మంత్రి శాలువాలు తెప్పించి ముగ్గురికి కప్పి ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించారు. బండి సాయన్న గౌడ్ కార్యదక్షత గొప్పది… ఆయన సరికొత్త కార్యక్రమాలతో గోపాను మరింత విస్తృతం చేస్తారని నమ్మకం ఉంది… విష్ యు ఆల్ ద బెస్ట్… నా యొక్క సమయాన్ని తప్పకుండా గోపాకు ఇస్తాను… నన్ను ఉపయోగించుకోండి… అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన స్టైల్ లో కలిసిన వారికి శుభాకాంక్షలు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. గోపా రాష్ట్ర కమిటీ ఎన్నికల వివరాలను మంత్రికి బండి సాయన్న గౌడ్ వివరించారు. ఎన్నికల కార్యక్రమం మరింత ప్రగతిదాయకమైన చర్చతో ఫలవంతమైనదని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గోపా శ్రేణులు పాల్గొని జనరల్ బాడీని విజయవంతం చేశాయని వివరించారు. ఇది మంచి పరిణామమని మంత్రి ప్రశంసించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని రానున్న రెండేళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గోపా అభివృద్ధికి పాటుపడాలని మంత్రి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ అధ్యక్షులు మోతే చక్రవర్తి గౌడ్ గోపా సభ్యులు కారింగుల బిక్షమయ్యగౌడ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, చీకూరి సత్యం గౌడ్, జి. వేణుబాబు గౌడ్ తదితరులు ఉన్నారు.
ఆల్ ద బెస్ట్ చెప్పిన
విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం
గోపా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన బండి సాయన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి జీ.వీ శ్రీనివాస గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్ లకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం శుభాకాంక్షలు తెలిపారు.
ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకోవడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు.
గోపాకు అండగా ఉంటా: నూతి శ్రీకాంత్ గౌడ్
గోపాకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను మేధావి వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగుతున్న గోపాకు అన్ని విధాల సహకరిస్తానని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గోపాకు పర్మనెంట్ అడ్రస్ తో కూడిన కార్యాలయం కావాలని తన శాఖ పరిధిలో భవనాలు ఎక్కడ ఉన్నాకల అలర్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓబీసీలకు మహర్దశ వచ్చిందని చెప్పారు.
ఓబీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను భారీగా పెంచినట్లు చెప్పారు.
గతంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం ఒక విద్యా సంవత్సరానికి రాష్ట్రం నుంచి 200 మందికి మాత్రమే ప్రభుత్వం సహాయం అందలేదని దాన్ని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తాను కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పిదప 1000 మంది విదేశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నానని చెప్పారు. గౌడ బిడ్డలు
ఎక్కడ ఏ అవసరమున్న తాను ఆపన్న హస్తం అందిస్తానని చెప్పారు. మేధావులు అంతా కలిసి
మేదో మధనం చేయడం అభినందనీయమన్నారు.
కంగ్రాట్యులేషన్స్ అంటూ గోపాకు అండగా ఉంటానన్న నేరెళ్ల శారద
మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ నేరెళ్ల శారద ను
గోపా బృందం కలిసినప్పుడు ఆమె “కంగ్రాట్యులేషన్స్… నేనెప్పుడూ గోపాకు అండగా ఉంటాను… అనే విషయం మర్చిపోవద్దు” అంటూ వివరించారు.
అదేవిధంగా
గౌడ్ హాస్టల్ ప్రెసిడెంట్ మోతె చక్రవర్తి గౌడ్ తన శుభాకాంక్షలు చెప్పారు. గోపా పూర్వాధ్యక్షులు ఈడ శేషగిరిరావు,
డాక్టర్ బోల్గం విజయభాస్కర్ గౌడ్ తదితరులను కూడా కలిశారు.