RN DAILY     G9 TELUGU TV    ePaper

కబడ్డీ జూనియర్ సీనియర్ విభాగాల్లో ప్రథమ బహుమతులను సాధించిన ఎస్.వీ.ఎన్ జట్లు

ఖో- ఖో జూనియర్ లో మండల ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్న ఎస్.వీ.ఎన్

పట్టుదలను పెంచేవి క్రీడలు: ఎస్.ఐ అనిల్

నిరంతర శిక్షణతోనే 16 మంది జిల్లా జట్లకు ఎంపిక:
ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23 (రోమింగ్ న్యూస్)

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడోత్సవాలలో యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటి తమదే పైచేయని నిరూపించారు. కబడ్డీ జూనియర్, కబడ్డీ సీనియర్ ఖో- ఖో జూనియర్, సీనియర్ విభాగాలలో జిల్లా జట్లకు పాఠశాలకు చెందిన ఏకంగా 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అంతేకాకుండా మండల స్థాయి జూనియర్ కబడ్డీ, సీనియర్ కబడ్డీల ప్రథమ బహుమతులను కూడా దక్కించుకున్నారు.

ఖో- ఖో ఆటలో జూనియర్ విభాగంలో మండల స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించారు.

అదేవిధంగా ఖో-ఖో లో సీనియర్స్ విభాగంలో

ద్వితీయ బహుమతిని సాధించారు. కబడ్డీ జూనియర్ అండర్ 14 విభాగంలో జిల్లా జట్టుకు పి. తేజ, డి. శ్రీకాంత్, ఎం. నందు, డి. రామ్ చరణ్ లు ఎంపికయ్యారు. ఖో- ఖో అండర్ 14 విభాగంలో జి. ఉదయ్ కిరణ్, జి రాకేష్, జీ దుర్గాప్రసాద్ లు ఎంపికయ్యారు. కబడ్డీ సీనియర్ అండర్ 17 విభాగంలో బి. గోవింద్, ఎం. అరుణ్, బీ.విగ్నేష్, బి. కిరణ్ లు ఎంపికయ్యారు. ఖో- ఖో అండర్ 17 విభాగంలో తాడూరి హిమరాజు, కళ్లెం జగదీప్, చెడుదీప్ బాలవర్ధన్, వీ. బాలాజీలు ఎంపికయ్యారు.

పట్టుదలను పెంచేవి క్రీడలు: ఎస్.ఐ అనిల్

విద్యార్థులలో క్రీడలు పట్టుదలను శారీరకదారుఢ్యాన్ని పెంచుతాయని యాదగిరిగుట్ట పట్టణ ఎస్.ఐ అనిల్ అన్నారు. ఎస్.జి.ఎఫ్ క్రీడల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సరైన శిక్షణ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఆటల పట్ల ఇంట్రెస్ట్ కలగడానికి నిరంతర శిక్షణ కారణమవుతుందని చెప్పారు. మంచి పిఈటి ఉన్న స్కూల్లో ఆటలు చక్కగా వృద్ధి చెందుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా పీఈటిల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తన దాతృత్వాన్ని చాటుకొని చేతులకు తన సొంత నిధులతో మెడల్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తాను చక్కటి క్రీడాకారుడను కావడానికి తనను ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులే కారణమన్నారు. అందువలన తాను ప్రథమంగా ఈ వృత్తి లోకి వచ్చానని చెప్పారు. ఖచ్చితంగా విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయని తాను నమ్ముతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు చెందిన పీఈటీలు, ప్రధానోపాధ్యాయులు, క్రీడల నిర్వహకులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందించిన ఎస్.వీ.ఎన్ యాజమాన్యం

యాదగిరిగుట్ట మండల స్థాయిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడల పోటీలలో సత్తా చాటి ఎన్నడూ లేని విధంగా పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు జిల్లా జట్లకు ఎంపిక కావడం పట్ల ఎస్.వీ.ఎన్ ఫౌండర్, కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చాలా పాఠశాలలను ఓడించి మండల స్థాయిలో పాఠశాలను ప్రథమ స్థానంలో నిలిపిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఖచ్చితంగా క్రీడలు అవసరమని తమ విశ్వసించడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.


నిరంతర శిక్షణ తమ
పీఈటీ మనోహర్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన
పీఈటీనీ కూడా ఆయన వారు ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో కూడా విద్యార్థులు అత్యుత్తమ ఆటను ప్రదర్శించి పాఠశాల పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!