
వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ
ఎన్నికల నిర్వహణకు సర్వం పూర్తి చేసిన ఎన్నికల కమిషన్
పోటీపడుతున్న అభ్యర్థులు అబిడ్స్ స్లేట్ ద స్కూలుకు రావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, రోమింగ్ న్యూస్: ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి పదవులకు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా డిజిటల్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రస్మా కమిషనర్ నర్రా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరస్పాండెంట్లు తాము గతంలోనే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి మూడు రోజులపాటు మాక్ ఓటింగ్ లో పాల్గొని ఓటు హక్కును విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి తోడు ట్రస్మా ఎన్నికల విధానానికి రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిజిటల్ బ్యాలెట్ ఎన్నికలకు వెళ్లిన సాధుల మధుసూదన్ ప్యానెల్ లో ఊహించని జోష్ ను తీసుకువచ్చింది. అంతకుమించిన ఆనందంతో సరికొత్త ప్రణాళికలతో సాదుల మధుసూదన్ ప్యానల్ ముందుకు సాగుతున్నది. మాక్ ఓటింగ్ సిస్టం నిర్వహించిన తీరు ఔరా…! అనిపించుకోవడంతో రెండు నాలుకల ధోరణితో ఉన్నవారి నోరు మూయించినట్టయింది.చరిత్రలో ఏ సంఘము గాని, ఏ రాజకీయ పార్టీ గాని, డిజిటల్ పద్ధతిలో ప్రతి సాధారణ సభ్యుడు ఇంత పారదర్శకంగా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును నిర్వహించుకున్న సందర్భాలు లేవు…నిర్వహించిన చరిత్ర లేదు… కానీ ట్రస్మా రాష్ట్ర ఎన్నికలు సరికొత్త చరిత్రకు శ్రీకారం పలుకనున్నాయనే టాక్ విస్తృతమవుతున్నది. ఎలాంటి రిగ్గింగు లేకుండా… పారదర్శకంగా… వ్యయ ప్రయాసలు లేకుండా… అత్యంత సులువైన పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించుకొని… సమయాన్ని వృధా కాకుండా ఓటింగ్ చేసే ప్రక్రియకు శ్రీకారం పలికిన విధానంపై ప్రతి ఒక్కరూ ఇప్పుడు దృష్టి సారించారు. ఇప్పుడు అందరి దృష్టి డిజిటల్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలపైనే నెలకొని ఉన్నది. ఈ ఎన్నికలు నిర్వహించే తీరు పైన అందరూ దృష్టి సారించారు. 5000 మంది కరస్పాండెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రస్మాలో బ్యాలెట్ పద్ధతి ఎన్నికలు ఆశామాషి విషయం కాదు… అయితే టెక్నాలజీని అందిపుచ్చుకొని నిర్వహిస్తున్న విధానం ఇప్పుడు చర్చానీయాంశమైంది.*పోటీపడుతున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి*ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థులందరికి, ఎలక్షన్ కమిషన్ ఆదివారం హైదరాబాదులోని సుజాత స్కూల్ కు తమ టెక్నికల్ ఎక్స్ పర్ట్ లతో ఉదయం 8:30 వరకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ డిజిటల్ బ్యాలట్ ను ప్రతి ఓటరుకు పంపించి, మీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరచుమని, అందరు తప్పకుండా ఓటు వేయాలని చైతన్య పరచాలని సూచించింది. ఎలక్షన్లు ఆపమని ఏ కోర్ట్ మరియు జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ ఆదేశించలేదని గమనించాలని తేట తెల్లం చేసింది. కావున ట్రస్మా ఐక్యతను కాపాడడానికి, ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేదా అని పరిశీలంచడానికి మీరు మరియు మీ యొక్క కంప్యూటర్ సాఫ్టువేర్లో అనుభవమున్న వ్యక్తి తో ఎలక్షన్లు జరుగుతున్న పద్ధతిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఉదయo 8.30 గంటలకు స్లేట్ ది స్కూల్, అబిడ్స్, హైదరాబాద్ కు రాగాలరని ట్రస్మా తెలంగాణ ఎన్నికల అధికారి యన్. నారాయణరెడ్డి కోరారు.