
ప్రముఖ విద్యావేత్త కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
హైదరాబాద్, రోమింగ్ న్యూస్:
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు తప్పకుండా ఓటు హక్కును కల్పించాలని ప్రముఖ విద్యావేత్త ట్రస్మా రాష్ట్ర నాయకులు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కోరారు. హైదరాబాదులో ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్షరాస్యతకు ప్రైవేట్ స్కూల్స్ ఎంతగానో పాటుపడుతున్నాయని చెప్పారు. 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు.
ఎంతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ అక్షరాస్య శాతంలో 60 శాతం బాధ్యతను తీసుకుంటున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ప్రజాస్వామ్య భావన దెబ్బతింటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో టీచర్ ఏ టీచర్ అయినా టీచరే…
దీనిలో ప్రభుత్వ ప్రైవేటు అని చూడకూడదు… విద్యార్థికి బోధించే బోధనలో ప్రభుత్వ ప్రైవేటు తేడాలు ఉండవని నాణ్యమైన విద్యను మాత్రమే బోధిస్తారు… అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు చేసిన విజ్ఞప్తిలో ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించడం వల్ల ఈ వృత్తులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ టీచర్లకు సరైన గుర్తింపు లేదని నేపథ్యంలో వారికి సముచిత గౌరవం దక్కించడం అవసరమని చెప్పారు. క్వాలిటీతో కూడిన ఉపాధ్యాయులు ఈ వృత్తిలోకి రావడంలేదని, ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినట్లయితే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారని చెప్పారు. ఫలితంగా మంచి విద్య బోధన విద్యార్థులకు అందుతుందని చెప్పారు.
విద్యా ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల పాత్ర ప్రశంసనీయం
విద్యా ప్రపంచంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పాత్ర ప్రశంసనీయమని అందులో పని చేసే ప్రతి ఉపాధ్యాయుడు టీచర్ ఎమ్మెల్సీకి అర్హుడని గతంలో ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. అవి ప్రస్తుతం ఇంప్లిమెంట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ కమిషన్ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఓటేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. కొంతమంది అధికారులు అక్కడక్కడ సహకరిస్తున్నప్పటికీ చాలాచోట్ల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వడం లేదని వివరించారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులు ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని అనే కోరారు.