


వసంత పంచమి వేడుకల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్టూడెంట్స్ కు స్లేట్లు… స్వీట్లు పంపిణీ చేసిన యాజమాన్యం

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:విద్యలకు అధిదేవత అయిన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని వండర్ కిడ్స్ ప్లే స్కూల్, ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి వేషధారణలో విద్యార్థినులు ఎంతగానో ఆకట్టుకున్నారు.


శాస్త్రోక్తంగా అమ్మవారికి సరస్వతి పూజ నిర్వహించి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు చదువు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ప్రదర్శించిన స్కిట్ లు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అక్షరాస్యత ప్రాధాన్యతను వివరించడంతోపాటు విద్య వైద్యుడు, న్యాయవాది, ఉపాధ్యాయుని రూపంలో ఎంతో మనో వికాసాన్ని కల్పిస్తూ జీవన గమనానికి ఉపయోగపడుతున్న విషయాలను విద్యార్థులు ఆసక్తికరంగా ప్రదర్శించారు.
ఘనంగా అక్షరాభ్యాసం

వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తమ పిల్లలతో తరలివచ్చిన తల్లిదండ్రులకు ఆశీర్వచనం జరిపిన మీదట పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, అకాడమిక్ డైరెక్టర్ గొట్టిపర్తి వృత్తిక్, అర్చకులు సీనియర్ విద్యావేత్త సంపతా చార్యుల చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

అక్షరాభ్యాసానికి తరలివచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా స్లేట్లు, స్వీట్లు పంపిణీ చేసి అభినందించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వండర్ కిడ్స్ ప్లే స్కూల్ ను ప్రారంభించిందని చెప్పారు.


దీనిద్వారా విద్యార్థుల్లో చాలా నేర్పు… ఓర్పుతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.టీచర్ల నిరంతర పర్యవేక్షణ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు నీడలా వెన్నంటి ఉండే మథర్ టీచర్లు వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని చెప్పారు.

వసంత పంచమి వేడుకలు ప్రాధాన్యతను తెలియయజేసే సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు.

