
యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా స్వస్తి వాచనం నిర్వహించడంతో మొదలయ్యాయి.

ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలోని అర్చకులు, పారాయణికులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వస్తి వాచనానికి శ్రీకారం పలికారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కరరావు ఆధ్వర్యంలోని దేవస్థానం సహాయకార నిర్వహణ అధికారి జూసెట్టి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.
