హైదరాబాద్, ఫిబ్రవరి 14 (రోమింగ్ న్యూస్):
షాహినయత్ గంజ్ పోలీస్ స్టేషన్ మరియు మక్తాల ఫౌండేషన్ సంయుక్త అధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలు నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గోషామహల్ ఏసీపీ ఆర్. సతీష్, హాజరయ్యారు.
షాహినయత్ గంజ్ పోలీస్ స్టేషన్ సీఐ వై. అజయ్ కుమార్, అడ్మిన్ ఎస్.ఐ. పీ. గోపాల్ రావు పోలీస్ సిబ్బంది, అతిధిగా మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యం. జలందర్ గౌడ్ మరియు ప్రవీన్ కుమార్ లు పాల్గోన్నారు. సమాజాన్ని పట్టిపిడిస్తున్న ప్రధాన సమస్య మాదక ద్రవ్యాల వాడకమని చెప్పారు.
సరదగా మోదలయ్యే ఈ అలవాటు… యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ మహమ్మరిని రూపుమాపాలంటే ప్రభుత్వం, పోలీసులే కాదు సమాజంలోని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు.
డ్రగ్స్ లాంటి హానికారక మత్తు పదార్థాలు విద్యార్థుల జీవితాలను చిధ్రం చేస్తాయన్నారు. అవగాహన కార్యక్రమాలతోనే విద్యార్థుల్లో డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల పట్ల చైతన్యం వస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని చెప్పారు. లేదంటే వారు చెడు వ్యాపకాలతో పక్కదారి పట్టే ప్రమాదముందని హెచ్చరించారు.