RN DAILY     G9 TELUGU TV    ePaper
రీజినల్ రింగ్ రోడ్డు మ్యాప్..

రోమింగ్ న్యూస్ బ్యూరో : హైదరాబాద్​ రూపురేఖలు మార్చుతుందని భావిస్తున్న రీజినల్​ రింగ్​రోడ్డు తొలి గెజిట్​ విడుదలైంది. ఉత్తర భాగం 158.64కి.మీ.కు కావాల్సిన భూసేకరణకు గెజిట్​ జారీ చేశారు. దీనిలో జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ సహా చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేటల ఆర్డీఓలు ఈ అథారిటీలో ఉన్నారు. తాజాగా ఆయా గ్రామాల వివరాలను పొందుపర్చుతూ గెజిట్​ను విడుదల చేశారు. మొత్తం 113 గ్రామాల పేర్లను పొందుపర్చి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గెజిట్​ ఇచ్చారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్‌మెంటు మ్యాపును విడుదల చేశారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్‌ రింగురోడ్డు క్రాస్‌ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్‌ ఛేంజర్లను నిర్మిస్తారు. మ్యాపులో వాటిని నిర్మించే ప్రాంతాలను కూడా సూచించారు. మూడు గెజిట్లు ట్రిపుల్​ ఆర్​ భూసేకరణ పూర్తికి కేంద్ర ప్రభుత్వం మూడు గెజిట్లు విడుదల చేయనున్నది. ఉత్తర భాగం వెళ్లే గ్రామాలు, అలైన్‌మెంట్‌ ఉన్న గ్రామాలు ఉన్న మండలాలు, ఎన్ని కిలోమీటర్లు, తదితర వివరాలతో గ్రామం, మండలం, జిల్లా పేర్లతో మొదటి గెజిట్‌ విడుదల చేశారు. రెండో గెజిట్‌లో గ్రామం పేరు, ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమిని సేకరిస్తారో వెల్లడించనున్నారు. సర్వే నంబర్‌, భూమి యజమాని పేరు కూడా పొందుపరుస్తారు. ఈ గెజిట్‌లోనే అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ తరువాత గ్రామసభ నిర్వహిస్తారు. ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి, పరిష్కరిస్తారు. గ్రామసభ ఆమోదం తరువాత వివరాలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తారు. అనంతరం పూర్తి వివరాలతో గ్రామాల వారీగా తుది గెజిట్‌ విడుదల చేస్తారు. దీని ప్రకారం భూమిని కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించి, భూమిని సేకరించి జాతీయ రహదారుల సంస్థకు అప్పగిస్తారు.చౌటుప్పల్​ రెవెన్యూ డివిజన్​ పరిధిలో 133.178 కిలోమీటరు నుంచి 158.645 కిలోమీటరు వరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు, చౌటుప్పల్, లింగోజిగూడెం, పంతంగి, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగడిపల్లి గ్రామాలున్నాయి. అదేవిధంగా వలిగొండ మండలం వర్కట్ పల్లి, గోకారం, పొద్దటూరు, వలిగొండ, సంగెం, పహిల్వాన్ పూర్, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక గ్రామాలున్నాయి. భువనగిరి ఆర్డీఓ పరిధిలోని 118.188 కిలోమీటరు నుంచి 133.178 కిలోమీటరు వరకు భువనగిరి మండలం రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్ పహడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్ నగర్, ఎర్రంబట్టి, నందనం ఉన్నట్లు గెజిట్​లో పేర్కొన్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి అడిషనల్​ కలెక్టర్​ పరిధిలో 98.989 కిలోమీటరు నుంచి 118.188 కిలోమీటరు వరకు యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్, దాతర్ పల్లి ఉండగా, తుర్కపల్లి మండలం గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కొనాపూర్, ఇబ్రహింపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి గ్రామాలున్నాయి. సిద్దిపేట జిల్లా పరిధిలో గజ్వేల్​ రెవెన్యూ డివిజన్​ పరిధిలో 67.129 కిలోమీటరు నుంచి 98.989 కిలోమీటరు వరకు రాయపోల్​ మంలం బేగంపేట, ఎల్కల్ ఉండగా, గజ్వేల్​ మండలం బంగ్లా వెంకటాపూర్, మక్తా మాసాన్ పల్లి, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముత్రాజ్ పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, పాములపర్తి గ్రామాలున్నాయి. వర్గల్ మండలం మాజీద్ పల్లి, మెంటూరు, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లి గ రామాలు,మర్కుక్ మండలం పరిధిలో మర్కుక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబెర్తి, ఎర్రవెల్లి గ్రామాలు, జగదేవ్ పూర్ మండలం పరిధిలో అలిరాజ్ పేట, ఇటిక్యాల్, పీర్లపల్లి గ్రామాలున్నాయి. మెదక్​ జిల్లా తూఫ్రాన్​ ఆర్డీఓ పరిధిలో 53.095 కిలోమీటరు నుంచి 67.129 కిలోమీటరు వరకు తూప్రాన్ మండలం విట్టూరు, జంధన్ పల్లి, ఇస్లాంపూర్, దాతర్ పల్లి, గుండారెడ్డిపల్లి, మల్కాపేర్, వెంటాయిపల్లి, కిష్టాపూర్, తూప్రాన్, నర్సంపల్లి గ్రామాలున్నాయి. కౌండిపల్లె మండలం వెంకటాపూర్, శివంపేట మండలం లింగోజిగూడ, పంబంద, పోతుల బోగూడ, కొంతన్ పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట, నర్సాపూర్ మండలం నాగులపల్లి, మూసాపేట, మహమ్మదాబాద్, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిర్మలాపూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట, సీతారాంపూర్, రుస్తుంపేట, మంతూరు, మల్పర్తి, తుజలాపూర్​ గ్రామాల పరిధి ఉంది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్​ ఆర్డీఓ పరిధిలో 25.304 కిలోమీటరు నుంచి 53.095 కిలోమీటరు వరకు సంగారెడ్డి మండలం సంగారెడ్డి, నాగాపూర్, ఇరిగిపల్లి, చింతల్ పల్లి, కలబ్ గూర్, తాడ్లపల్లి, కులబాగూరు గ్రామాలు, సదాశివపేట మండలం పెద్దపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్, మల్కాపూర్, హత్నూర్ మండలం కాసల్, దేవల్ పల్లి, హత్నూరు, తౌల్తాబాద్ కొత్తపేట, సికిందరాపూర్ గ్రామాలున్నాయి. ఆంధోల్ జోగిపేట ఆర్డీఓ పరిధి 9.56 కిలోమీటరు నుంచి 18.183 కిలోమీటరు వరకు చౌటకూరు మండలం శివంపేట, వెండికోల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలున్నట్లు గెజిట్​లో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!