యాదాద్రి, ఏప్రిల్ 22( రోమింగ్ న్యూస్):
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తో రూపొందించిన స్టడీమెటీరియల్స్ ను యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామానుజాచార్యులు శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మే ఆరో తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్టడీమెటీరియల్ ను ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ, విద్యార్థుల కోసం రూపొందించినదని చెప్పారు. నాణ్యమైన ఫలితాలు సాధించడానికి స్టడీ మెటీరియల్ ఎంతో దోహదపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కరుణాకర్ రెడ్డి, జిల్లా నరసింహ, రాజు, గాజుల రమేష్, రవిబాబు, బలరాం, రాంబాబు, హైమావతి, నాగలక్ష్మి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.